Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సైబర్ మోసం కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు సైబర్ నేరగాళ్ల మాయలో పడి ఏకంగా 24 లక్షల రూపాయలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రజలు సైబర్ నేరాలు బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఎరువులంటూ ఎర వేశారు. ఉచ్చులో చిక్కాక దరువేశారు. అందినకాడికి దోచేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మగటిపల్లికి చెందిన కొనుకు శ్రీనివాస్ ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి 24 లక్షల రూపాయలు కోల్పోయారు.
Also Read
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
- Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
- Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
Perni Nani Quash Petition: పేర్ని నాని క్వాష్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
మొబైల్ ఫోన్‌లో ఫేస్‌బుక్ స్క్రోల్ చేస్తుండగా ఒక ఆకర్షణీయమైన లింక్ కనిపించింది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పేరుతో 10 లక్షల రూపాయల విలువైన ఎరువులు పంపిస్తామని.. వాటిని అమ్మితే 5 లక్షల రూపాయల లాభం వస్తుందని ఆ లింక్‌లో చూపించారు. అంటే సగానికి సగం లాభం. ఇది చూసిన తర్వాత ఎవరైనా ఆశపడకుండా ఉంటారా? అది నిజమని నమ్మిన శ్రీనివాస్.. ఆ లింక్‌లో లాగిన్ అయ్యారు.
ఇంకేముంది అప్పటికే కాచుకుని కూర్చున్న సైబర్ క్రిమినల్స్ వలకు చిక్కారు శ్రీనివాస్. కొద్ది సేపటికే సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి.. మీకు సరకు లారీ ద్వారా వస్తుందని.. ముందుగా కొన్ని ఛార్జీలు చెల్లించాలని చెప్పారు. మొదట చిన్న మొత్తాలుగా ప్రారంభమైన చెల్లింపులు, తర్వాత పెద్ద మొత్తాలుగా మారాయి. దఫాదఫాలుగా ఫోన్‌పే ద్వారా మొత్తం 24 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి, సరకు లారీలో వస్తోందని.. మరికొంత మొత్తం వేయాలని అడిగారు. ఈసారి అనుమానం వచ్చిన శ్రీనివాస్ వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు.
IND vs NAM: ఇషాన్ కిషన్ మెరుపులు.. హార్దిక్ ఫినిషింగ్ టచ్! నమీబియాకు భారీ టార్గెట్
పోలీసుల చొరవతో బ్యాంకు అధికారులు 24 లక్షల్లో 9 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేశారు. మిగతా మొత్తాన్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సమాజానికి మార్గదర్శకులు అయిన ఉపాధ్యాయులు కూడా సైబర్ మోసాలకు గురవడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై సిఐ భీమరాజు మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గవర్నమెంట్ స్కీమ్ పేరుతో డబ్బు అడిగితే వెంటనే అనుమానించాలని తెలిపారు. అపరిచిత లింక్‌లపై క్లిక్ చేయకుండా, అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే సమాచారం తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!