Crime News: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి.. హత్యా/ఆత్మహత్య?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ఉత్తరప్రదేశ్ లోని కాసగంజ్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమాంపూర్ కోతవాలి పరిధిలోని ఎటా రోడ్డుపై ఉన్న ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో తండ్రి, తల్లి, ముగ్గురు చిన్నారుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
IND vs SA: నేడు సూపర్-8లో భారత్ తొలి పోరు.. టీ20ల్లో భారత్-దక్షిణాఫ్రికా హెడ్-టు-హెడ్ రికార్డ్స్ ఇవే
Also Read
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
మృతుడు సత్యేంద్ర అలియాస్ ఫౌజీగా పోలీసులు గుర్తించారు. అతను తన భార్య, ఇద్దరు కుమార్తెలు (12, 10 సంవత్సరాలు), ఒక కుమారుడు (8 సంవత్సరాలు)తో కలిసి నివసిస్తున్నాడు. శనివారం సాయంత్రం సత్యేంద్ర మృతదేహం గదిలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించగా.. భార్య, ముగ్గురు పిల్లల మృతదేహాలు మంచంపై పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మూడు రోజులుగా ఇల్లు మూసివేసి ఉండటం, ఎలాంటి శబ్దం లేకపోవడంతో స్థానికులకు అనుమానం కలిగింది. శనివారం సాయంత్రం కూడా ఇంటి నుంచి ఎలాంటి అలజడి లేకపోవడంతో పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపు తట్టినా స్పందించకపోవడంతో తలుపు తెరిచి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం వారిని షాక్‌కు గురి చేసింది.
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ తో పాటు ఇతర పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందాన్ని కూడా పిలిపించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Pakistan Airstrikes: ఆఫ్ఘన్ సరిహద్దులో పాకిస్తాన్ వైమానిక దాడి..19 మంది మృతి
స్థానికుల ప్రకారం, సత్యేంద్ర ముందుగా భార్య, పిల్లలను హత్య చేసి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అయితే ఇది హత్యా–ఆత్మహత్యా లేదా సమూహ ఆత్మహత్యా అనే విషయంపై స్పష్టత పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?