Site icon NTV Telugu

Crime News: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి.. హత్యా/ఆత్మహత్య?

Person Died

Person Died

Crime News: ఉత్తరప్రదేశ్‌ లోని కాసగంజ్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమాంపూర్ కోతవాలి పరిధిలోని ఎటా రోడ్డుపై ఉన్న ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో తండ్రి, తల్లి, ముగ్గురు చిన్నారుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

IND vs SA: నేడు సూపర్-8లో భారత్ తొలి పోరు.. టీ20ల్లో భారత్-దక్షిణాఫ్రికా హెడ్-టు-హెడ్ రికార్డ్స్ ఇవే

మృతుడు సత్యేంద్ర అలియాస్ ఫౌజీగా పోలీసులు గుర్తించారు. అతను తన భార్య, ఇద్దరు కుమార్తెలు (12, 10 సంవత్సరాలు), ఒక కుమారుడు (8 సంవత్సరాలు)తో కలిసి నివసిస్తున్నాడు. శనివారం సాయంత్రం సత్యేంద్ర మృతదేహం గదిలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించగా.. భార్య, ముగ్గురు పిల్లల మృతదేహాలు మంచంపై పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మూడు రోజులుగా ఇల్లు మూసివేసి ఉండటం, ఎలాంటి శబ్దం లేకపోవడంతో స్థానికులకు అనుమానం కలిగింది. శనివారం సాయంత్రం కూడా ఇంటి నుంచి ఎలాంటి అలజడి లేకపోవడంతో పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపు తట్టినా స్పందించకపోవడంతో తలుపు తెరిచి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం వారిని షాక్‌కు గురి చేసింది.

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ తో పాటు ఇతర పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందాన్ని కూడా పిలిపించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Pakistan Airstrikes: ఆఫ్ఘన్ సరిహద్దులో పాకిస్తాన్ వైమానిక దాడి..19 మంది మృతి

స్థానికుల ప్రకారం, సత్యేంద్ర ముందుగా భార్య, పిల్లలను హత్య చేసి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అయితే ఇది హత్యా–ఆత్మహత్యా లేదా సమూహ ఆత్మహత్యా అనే విషయంపై స్పష్టత పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.

Exit mobile version