Site icon NTV Telugu

AP Crime: కారులో ఏకాంతంగా ప్రేమజంట.. దాడి చేసి బంగారం, నగదు దోపిడీ..

Robbery

Robbery

AP Crime: జనసంచారం లేని ప్రాంతానికి వెళ్లి ప్రేమ జంటలు కొన్నిసార్లు కలుసుకునే సందర్భాలు ఉంటాయి.. అయితే, అలాంటి వారిని టార్గెట్‌ చేసి దాడులు చేసి.. అందినకాడికి దోచుకున్న సందర్భాలు.. అంతేకాదు.. అబ్బాయిపై దాడి చేసి.. అమ్మాయిలపై లైంగిక దాడులు చేసిన ఘటనలు కూడా ఎన్నో వెలుగు చూశాయి.. తాజాగా, నంద్యాల శివారులోని రైతునగర్ లో ఇలాంటి ఘటనే జరిగింది.. రైతు నగర్‌ దగ్గర కారులో ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటపై దాడి చేశారు దొంగలు.. అందనికాడికి దోచుకొని పరారయ్యారు..

Read Also: Pragya Jaiswal: బాలకృష్ణతో వరుస ఆఫర్లపై ప్రజ్ఞా జైస్వాల్ వైరల్ కామెంట్స్..

ప్రేమజంట ఏకాంతంగా ఉన్న కారుపై రాళ్లు విసిరి, ప్రేమికులు ప్రభాస్, యువతిని చితకబాది.. 3 తులాల బంగారు గొలుసు, రూ 10 వేల నగదును దోచుకున్నారు దోపిడీ దొంగలు. ప్రేమిజంట ప్రభాస్, యువతి రైతునగర్ ప్రాంతంలో కారులో ఏకాంతంగా ఉండగా.. ముసుగు ధరించిన ముగ్గురు దారి దోపిడీ రాళ్లు విసిరారు. దాంతో భయంతో ప్రేమ జంట వణికిపోయింది.. తర్వాత యువకుడు, యువతిని కారులో నుంచి బయటకు లాగి కత్తులతో బెదిరించి, విచక్షణారహితంగా చితకబాదారు దోపిడీ దొంగలు.. ప్రభాస్ ను విచక్షణారహితంగా కొట్టి రూ 10 వేల నగదు, యువతి మెడలోని 3 తులాల గొలుసు లాక్కుని ఉడాయించారు.. ప్రాణ భయంతో నంద్యాల జీజీహెచ్‌లో ప్రభాస్ చేరాడు. సమాచారం అందగానే సంఘటన స్థలానికి డీఎస్పీ జావలి ఆల్ఫోన్సా , క్లూస్ టీమ్ సంఘటన స్థలాన్ని చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. ఇటీవలే శాంతి రాం హాస్పిటల్ వద్ద హైవే ప్రాంతంలో బైక్ పై వెళ్తున్న దంపతులపై ఇదే తరహాలో దోపిడీకి పాల్పడ్డారు దొంగలు.

Exit mobile version