Uttar Pradesh: నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుడి ఎన్కౌంటర్..
- నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..
- నిందితుడి ఎన్కౌంటర్ తర్వాత అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో నీట్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు జితేంద్ర అలియాస్ భోలాను పోలీసులు ఎన్కౌంటర్ చేసి, అరెస్ట్ చేశారు. భారతికూప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మడ్ఫా అడవుల్లో నిందితుడు దాక్కున్నాడనే సమాచారంతో యూపీ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్ఓజీ) జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్ సమయంలో నిందితుడు పోలీసులపై కాల్పులు జరపడంతో, పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడి కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. కాల్పుల ఘటనలో బహిల్పుర్వా పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ రాఘవేంద్ర కూడా గాయపడ్డారు. అంతకుముందు, నిందితుడిపై పోలీసులు రూ. 50,000 వేల రివార్డు ప్రకటించారు.
జూలై 22న మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి దేవంగన ఎయిర్‌పోర్టు సమీపంలో నడుస్తుండగా ముగ్గురు వ్యక్తులు అటవీ అధికారులమని చెబుతూ అడ్డుకున్నారు. యువకుడిని చెట్టుకు కట్టేసి, విద్యార్థినిపై ఇద్దరు నిందితులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందాలు నిందితుడి కోసం గాలింపు చేపట్టాయి. సీసీటీవీ ఫుటేజ్, ఎలక్ట్రానిక్ నిఘా, స్థానిక సమాచారంతో నిందితులను గుర్తించారు. బాధితురాలు ఫోటోల ద్వారా నిందితుల్ని గుర్తించింది. నిందితుడి వద్ద నుంచి రెండు అక్రమ .315 బోర్ పిస్టళ్లు, తూటాలు, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని చిత్రకూట్ ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ వెల్లడించారు.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!