Wife Cheating: వివాహేతర సంబంధాల మోజులో కొందరు మహిళలు దారుణాలకు ఒడిగడుతున్నారు. తమ రాసలీలలకు, సంతోషాలకు అడ్డుగా ఉన్నారన్న నెపంతో.. కట్టుకున్న భర్తలనే కడతేర్చుతున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఒక వివాహిత కూడా అదే పని చేసింది. కుర్రాడితో తాను పెట్టుకున్న ఎఫైర్‌కి అడ్డొస్తున్నాడని, గొంతు నులిమి భర్తని చంపింది. అనంతరం ఈ కేసుని తప్పుదోవ పట్టించేందుకు పథకాలు రచించింది. చివరికి అడ్డంగా బుక్కైంది, కటకాలపాలైంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని గుంజాండి ఊరుకు చెందిన సెల్వరాజ్ (31)కు కొంతకాలం క్రితం వనిత అనే మహిళతో వివాహం అయ్యింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
కట్ చేస్తే.. సెల్వరాజ్ ఓ ఫైనాన్షియర్ కావడంతో, ఎక్కువ సమయం బయటే గడిపేవాడు. రాత్రి ఇంటికి రావడానికి కూడా ఆలస్యం అయ్యేది. ఈ క్రమంలోనే.. వనిత ఒక కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో, ఆ కుర్రాడిని ఇంటికి పిలిపించుకునేది. భర్త ఇంటికి రావడం ఆలస్యమైతే, ఇద్దరు కలిసి షికారుకు వెళ్లేవారు. అయితే.. వీరి బాగోతం ఎంతోకాలం దాగి ఉండలేదు. ఒకరోజు వీళ్లు సెల్వరాజ్‌కు అడ్డంగా బుక్కయ్యారు. తన భర్త ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని అనుకోని, ఒకరోజు కుర్రాడిని ఇంటికి రప్పించుకుంది. పని పెద్దగా లేకపోవడంతో సెల్వరాజ్ త్వరగా ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు ఇంట్లో కుర్రాడితో రాసలీలల్లో మునిగితేలుతున్న భార్యని చూసి ఒక్కసారిగా కుంగిపోయాడు. ఆ కుర్రాడు అక్కడినుంచి పారిపోగా.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇంకోసారి ఆ కుర్రాడితో తిరిగొద్దని వారించాడు.
అయినా వనిత వినిపించుకోలేదు. మొదట్లో తాను మారినట్లు నాటకమాడి, ఆ తర్వాత మళ్లీ ఈ కుర్రాడ్ని ఇంటికి రప్పించుకోవడం మొదలుపెట్టింది. దీంతో, భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. సెప్టెంబర్ 5వ తేదీ కూడా వీరి మధ్య ఘర్షణ జరిగింది. ఇక మొత్తానికే భర్త అడ్డు తొలగించుకోవాలనుకొని, అదే రోజు రాత్రి సెల్వరాజ్ నిద్రపోతున్న సమయంలో వనిత అతని గొంతు నులిమి చంపింది. ఉదయాన్నే తన భర్త నిద్రలోనే పోయాడంటూ డ్రామాలాడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. భార్యపై అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించారు. మరో దారి లేక వనిత తన నేరం ఒప్పుకుంది. మంగళవారం ఈ కేసుని కోర్టు విచారించగా.. నేరం నిరూపితం కావడంతో వనితకు యావజ్జీవ శిక్ష విధించింది.