కొందరు సుఖాల వల్లో.. లేక బిడ్డలు భారం అవ్వడం వల్లో కొందరు చిన్నారులు అందరు ఉన్నా కూడా అనాధలు అవుతున్నారు.. అలాంటి వారిని కొందరు ఆదుకుంటున్నారు.. వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు.. వారికి అన్నీ తానై చూసుకుంటున్నారు.. చిన్నవయస్సులో వాళ్ళు పడే కష్టాలను చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది.. కానీ మహిళా ఓ చిన్నారి పై అత్యంత దారుణంగా ప్రవర్తించింది.. ఇదంతా సిసిటీవీ కెమెరాలో రికార్డు అవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది.. ప్రస్తుతం ఆ మహిళను ఉరి తియ్యాలనే వార్తలు వినిపిస్తున్నాయి..
జంతువులు కూడా సిగ్గు పడేలా ఓ అడాప్షన్ సెంటర్‌కు చెందిన మహిళా స్టాఫ్ దారుణంగా ప్రవర్తించింది. పసివాళ్లనే కనీసం కనికరం లేకుండా పిల్లలను దారుణంగా కొట్టింది. నిండా ఆరేళ్లు కూడా లేని పసి పిల్లలు ఏడుస్తూ.. వేడుకుంటున్నా విచక్షణా రహితంగా చావగొట్టింది. ఈ దారుణ ఘటన చత్తీస్‌ఘడ్‌లోని కాంకేర్ జిల్లాలోని అడాప్షన్ సెంటర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ప్రతి ఒక్కరూ కూడా ఆ మహిళ పై తీవ్రంగా మండిపడుతున్నారు..
కాంకేర్ జిల్లాలోని ఓ అడాప్షన్ సెంటర్‌లో ఆరు ఏళ్ల కంటే తక్కువ వయసున్న అనాథలైన పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. అక్కడ సీమా ద్వివేది అనే మహిళ ప్రోగ్రాం మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోంది. తాజాగా బయటికి వచ్చిన వీడియోలో.. నిండా ఆరేళ్లు కూడా లేని ఇద్దరు చిన్నారులను క్రూరంగా కొడుతూ హింసించింది. పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నా కనికరించకుండా పిల్లల జుట్టు పట్టుకుని చితక్కొట్టడం కనిపిస్తుంది.అంతేకాదు వారిని నేలకేసి దారుణంగా కొడుతుంది.. ఈ తతంగం అంతా అక్కడ ఉన్న సిసిటీవీ పుటేజ్ లో కనిపిస్తుంది.. అది సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చెయ్యడం తో వైరల్ అవుతుంది.. ఆ వీడియోను చూసిన వారంతా కూడా దారుణంగా తిడుతున్నారు.. ఇలాంటి వాళ్లను ఏం పాపం లేదు.. అరెస్ట్ చెయ్యండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. మీరు ఆ దారుణం వీడియోను ఒకసారి చూడండి..
कांकेर की इस जल्लाद महिला को देखिये
कांकेर के प्रतिज्ञा विकास संस्थान की यह तस्वीर आपको विचलित कर देगी। महिला का नाम सीमा द्विवेदी है, जो अनाथ बच्चों के साथ इस तरह का बर्ताव कर रही है। :@ranutiwari_17 pic.twitter.com/y48ZXKN2wV
— Bastar Talkies (@BastarTalkies) June 5, 2023