Charlapalli Su*ici*de case: చర్లపల్లిలో తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. ప్రాణహాని ఉందంటూ పీఎస్‌కు విజయారెడ్డి భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charlapalli Su*ici*de case: హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మూడు నెలల క్రితం తల్లి, ఇద్దరు పిల్లలు రైలు కిందపడి మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కొత్త మలుపు చోటుచేసుకుంది. మృతురాలు విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందంటూ మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. సురేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తన భార్య విజయశాంతి రెడ్డి, కుమార్తె చైతన్య రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి మరణాలకు తన బావమరిది వడకళ్ల చిరంజీవి, అత్త పుష్పావతి, చిరంజీవి భార్య లక్ష్మీ కారణమని ఆరోపించారు. ముగ్గురి మరణానికి వీరే కారణమని, ఇప్పుడు తన ఆస్తిని చేజిక్కించుకునేందుకు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా తన ప్రాణాలకు ముప్పు ఉందని, వెంటనే పోలీసు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు.
ఘటన వివరాలు
మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లోని హరితవనం కాలనీలో సురేందర్ రెడ్డి, విజయశాంతి రెడ్డి దంపతులు నివాసం ఉండేవారు. వీరికి చైతన్య రెడ్డి, విశాల్ రెడ్డి అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు. సురేందర్ రెడ్డి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేవారని సమాచారం. విజయశాంతి రెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ నెలకు లక్ష రూపాయల వరకు వేతనం పొందుతున్నట్లు తెలిసింది. కుమార్తె చైతన్య రెడ్డి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, కుమారుడు విశాల్ రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
అనుమానాలకు తావిస్తున్న మరణాలు
జనవరి 30న అర్ధరాత్రి సమయంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్‌పై విజయశాంతి రెడ్డి, ఆమె ఇద్దరు పిల్లలు మృతిచెందిన ఘటన సంచలనంగా మారింది. ఒకేసారి ముగ్గురు రైలు కిందపడి చనిపోవడం, పిల్లలు పెద్దవారై ఇంటర్ చదువుతున్న వయసులో ఉండటం వల్ల ఈ మరణాలపై అప్పటినుంచే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా భర్త చేసిన ఆరోపణలు, ప్రాణహాని ఫిర్యాదుతో ఈ కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఆత్మహత్యగా నమోదైన ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?