రోజు రోజుకు మానవత్వం మంటగలిసిపోతుంది. ట్రాక్టర్ లైట్ దొంగిలించాడనే అనుమానంతో 14 ఏళ్ల బాలుడిపై దారుణంగా వ్యవహరించారు కొందరు దుర్మార్గులు. బాలుడిని దారుణంగా హింసించి, చివరికి నిప్పంటించారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర స్ధాయిలో వారిపై మండిపడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Read Also: Old City Police Dance: డ్యాన్స్ చేసి.. ఉల్లాసంగా గడిపిన ఓల్డ్ సిటీ పోలీసులు.. వీడియో వైరల్
పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ధూలే జిల్లా శిర్పూర్ తాలూకాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ లైట్ దొంగిలించాడనే అనుమానంతో 14 ఏళ్ల బాలుడి కిడ్నాప్ చేసి చిత్ర హింసలకు గురిచేశారు. చివరకు నిప్పు అంటించారు. తీవ్ర గాయాలపాలైన బాలుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.అయితే.. ఉదయం నుంచి ఉన్న బాలుడు సడెన్ గా కనిపించకుండా పోయాడు. చింతమన్ అలియాస్ చింటు, సచిన్ అనే ఇద్దరు వ్యక్తులు బాలుడిని కారులో ఎత్తుకెళ్లారు. అనంతరం జలోద్ రోడ్డు సమీపంలో ఉన్న భాంపూర్ పొలంలోని ఇటుక బట్టీ దగ్గర తీసుకెళ్లి వివరీతంగా కొట్టారు. ఇనుప ఎద్దుల బండికి గట్టిగా కట్టేశారు. అనంతరం బండి కింద నిప్పుపెట్టారు. దీంతో బాలుడికి తీవ్ర గాయాలపాలయ్యాడు.
Read Also:YS Jagan-KTR: ఒకే ఫ్రేమ్‌లో వైఎస్ జగన్, కేటీఆర్.. ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్..!(ఫొటోస్)
ఎలాగో అలాగా తప్పించుకున్న బాలుడు తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పడంతో .. వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే గాయపడిన బాలుడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. నిందితులు చింతమన్ కోలి, సచిన్ కోలిలపై కిడ్నాప్, హత్యా యత్నం కేసులు పెట్టారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.