NTV Telugu Site icon

Kerala: సైకోగా మారిన యువకుడు.. ప్రియురాలి సహా కుటుంబాన్ని చంపిన దుర్మార్గుడు

Keralamurder

Keralamurder

కేరళలోని తిరువనంతపురంలో దారుణం జరిగింది. ఓ యువకుడు సైకోగా మారి మారణహోమం సృష్టించాడు. ప్రియురాలి సహా ఆమె కుటుంబ సభ్యులను దారుణాతీదారుణంగా హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అనంతరం వెంజరమూడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆరుగురిని చంపేసినట్టుగా పోలీసులకు చెప్పి నిందితుడు అఫాన్ (23) విషం తాగి లొంగిపోయాడు. దీంతో అఫాన్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: NBK : బాలయ్య – గోపిచంద్ మలినేని ఊహించిన దానికి మించి

అఫాన్ అనే యువకుడు.. ఒక అమ్మాయిను ప్రేమించాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. అఫాన్.. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న ప్రియురాలి కుటుంబ సభ్యులను సుత్తి, కత్తితో దాడి చేసి చంపేశాడు. అయితే నిందితుడు.. తన తల్లిపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆమె కేన్సర్ పేషెంట్. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో కోలుకుంటోంది.   ప్రియురాలి ఫర్షానా, ఆమె సోదరుడు అహ్సాన్, అమ్మమ్మ సల్మా బివి, మామ లతీఫ్, అత్త షాహిదా మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక నిందితుడిపై రెండు పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి: Spirit : సందీప్ రెడ్డి స్పెషల్ కండిషన్స్.. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్!?

అయితే నిందితుడు అఫాన్ పోలీసులకు సమాచారం ఇస్తూ.. అప్పుల్లో ఉన్న తనకు ప్రియురాలి కుటుంబం సాయం చేయలేదని.. ఆ కారణం చేతనే చంపినట్లు అఫాన్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక పరమైన కారణాల చేతనే ఈ సామూహిక హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు గల్ఫ్‌లో వ్యాపారం చేస్తుండగా భారీ నష్టాలు వచ్చాయని.. దీంతో అప్పులు ఎక్కువైపోవడం.. ప్రియురాలి కుటుంబం సాయం చేయకపోవడం వల్లే ఈ హత్యలు జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Roja: చాలా రోజుల తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన రోజా..