Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
- ఇంట్లో కోడి రక్తంతో డ్రామా..
- లవర్‌తో పారిపోయిన మైనర్ బాలిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Girl Elopes With Lover: బీహార్‌లో రోహ్తాజ్ జిల్లాలో 16 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది. ఇంట్లో ప్రతీ చోట రక్తం కనిపించడంతో కుటుంబీకులు ఏదో దారుణం జరిగిందని అనుమానించారు. అయితే, పోలీసుల రంగ ప్రవేశంతో 15 రోజుల తర్వాత అసలు విషయం తెలిసింది. ఇంట్లో ఉన్న రక్తం అసలు మనిషిది కాదని, కోడి రక్తమని తేలింది. మైనర్ బాలిక తన తెలివితో అందర్ని బురిడీ కొట్టిద్దామని చూసింది. తన లవర్‌తో పారిపోయేందుకు ఇలా ప్లాన్ చేసింది.
ఇంద్రపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని బధిహా గ్రామానికి చెందిన ఒక నివాసి, ఏప్రిల్ 30వ తేదీ రాత్రి తన మైనర్ కుమార్తె ఇంటి నుండి అకస్మాత్తుగా అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్లంతా రక్తం మరకలు ఉండటంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. ముందగా పెరటిలో బ్లడ్ పడి ఉండటంతో కిడ్నాప్ లేదా హత్య జరిగిందని ముందుగా పోలీసులు భావించారు, విచారణ ముమ్మరం చేశారు. బాలిక కోసం గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, మొబైల్ కాల్ వివరాలు, లొకేషన్ ట్రాకింగ్ ఆధారంగా పోలీసుల విచారణ సాగింది.
Also Read
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
చివరకు బాలిక తన లవర్‌తో కలిసి ఇళ్లు వదిలి పారిపోయిందని తేలింది. మహారాష్ట్రలోని థానే జిల్లా భివండిలో తన ప్రియుడు మాయాంక్ కుమార్‌తో కలిసి ఉన్నట్లు గుర్తించారు. వీరిద్దరిని పోలీసులు బీహార్ తీసుకువచ్చారు. నిందితుడు మయాంక్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. బాలిక, మయాంక్ సుమారు 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తేలింది. కుటుంబం వ్యతిరేకిస్తుందనే భయంతో ఇద్దరూ పారిపోయారు. ప్రణాళికలో భాగంగా ఒక కోడిని చంపి రక్తాన్ని ఇల్లంతా చల్లినట్లు తేలింది.
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?