Bengaluru: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం హత్య ఘటన మరవకముందే దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగళూర్‌లో ఓ విద్యార్థినిపై రేప్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. యువతిపై గుర్తుతెలియని బైకర్ అత్యాచారం చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.