Bengaluru: కొత్తగా పెళ్లయిన జంట రెండు రోజుల వ్యవధిలో ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఇద్దరు 1000 కి.మీ దూరంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గురువారం బెంగళూర్‌లో భార్య గనవి(26) ఆత్మహత్యకు పాల్పడింది. రెండు రోజుల తర్వాత 36 ఏళ్ల సూరజ్ శివన్న నాగ్‌పూర్‌లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. గనవి సూసైడ్ తర్వాత, భర్తనే ఆత్మహత్యకు ప్రేరేపించడానే ఆరోపణలతో సూరజ్‌పై కేసు నమోదైంది.
అక్టోబర్ 29న బెంగళూర్‌లో ఈ జంటకు వివాహం జరిగింది. ఆ తర్వాత హనీమూన్ కోసం శ్రీలంకుకు వెళ్లారు. అయితే, ఇద్దరి మధ్య ఒక వివాదం కారణంగా వీరి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ఇద్దరు కూడా గత వారమే బెంగళూర్ తిరిగి వచ్చారు. గనవి తన అత్తమామల నుంచి అవమానాలను ఎదుర్కొందనే ఆరోపణలు రావడంతో తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. మంగళవారం గనవి ఆత్మహత్యకు ప్రయత్నించగా, ఆమెను ఆస్పత్రికి తరలించారు. తరువాత బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. గురువారం ఆమె మరణించింది.
గనవి మరణాంతరం, ఆమె కుటుంబం సూరజ్, అతడి కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ఆమె అత్తమామల ఇంటి ముందు నిరసన తెలిపి, వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బెంగళూర్‌లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న తర్వాత, సూరజ్, ఆయన తల్లి జయంతి నాగ్‌పూర్ వెళ్లారు. అక్కడ శివన్న కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వార్ధా రోడ్డులోని ఒక హోటల్‌లో సూరజ్ ఆత్మహత్య గురించి ఆయన సోదరుడు సంజయ్ శివన్న నాగ్‌పూర్ పోలీసులకు సమాచారం అందించారు.
