KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KMM CYBER CASE: ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన వెయ్యికోట్ల సైబర్ చీటింగ్ కేసులపై సిట్ ఏర్పాటైంది. సైబరాసురులు ఆడిన రాక్షస క్రీడను.. అమాయకుల పేరుతో బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ నేరాలకు వాడిన తీరును సిట్ బృందం వెలికి తీయనుంది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి డీఎస్పీ కె.వి. మురళీధర ప్రసాద్ నేతృత్వం వహించనున్నారు. ఇప్పటికే ఉన్న కేసులను స్వాధీనం చేసుకున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్తగా కేసు నమోదు చేసి ముందుకు వెళ్లనుంది. ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన రూ.1,000 కోట్లకు పైగా సైబర్ మోసాల కేసుల దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ కేసులను సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు బదిలీ చేశారు. ఇందులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో నమోదైన రెండు కేసుల ఆధారంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్తగా కేసు నమోదు చేసి సిట్ టీమ్ దర్యాప్తు ప్రారంభించింది.
ఖమ్మం జిల్లా వి.ఎం. బంజారా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుతో పాటు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసును సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంలో సాంకేతిక ఆధారాలు, బ్యాంకు లావాదేవీలు, మనీలాండరింగ్ కోణాలపై సిట్ లోతైన విచారణ చేపట్టనుంది. డీఎస్పీ కె.వి. మురళీధర ప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఈ విచారణ బాధ్యతలు అప్పగించారు. ప్రతి వారం దర్యాప్తు పురోగతి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు.
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిపించారు కొంత మంది కేటుగాళ్లు. ఆ ఖాతాలను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అలా తమ చేతుల్లో ఉన్న ఖాతాలను సైబర్ నేరాలకు వినియోగించారు. దేశవ్యాప్తంగా జరిగిన సైబర్ మోసాల సొమ్మును ఆయా ఖాతాల ద్వారా బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఈ ఖాతాల ద్వారా దాదాపు రూ.1,000 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇప్పుడివే అంశాలను సిట్ వెలికి తీయనుంది. ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ సైబర్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులు అరెస్టు అయ్యారు. మిగిలిన నిందితులు, వారికి సహకరించిన వ్యక్తులు, కంపెనీలు, బ్యాంకు ఖాతాల నెట్‌వర్క్‌పై సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేకంగా దృష్టి సారించింది. దర్యాప్తు వేగవంతం కావడంతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోత్రు ప్రవీణ్ ఉన్నాడు. పొత్రు కళ్యాణ్, మోరంపూడి చెన్నకేశవ రావు, జన్జునూరి శివకృష్ణ, ఉడుతనేని వికాస్.. ఈ భారీ చీటింగ్‌లో ఇతర నిందితులుగా ఉన్నారు.
- Tags
- Be Alert
- crime
- NTV Telugu
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!