Site icon NTV Telugu

Student Missing: పటాన్‌చెరులో బీ ఫార్మసీ విద్యార్థిని అదృశ్యం.. అదే చివరి కాల్‌..!

Student Missing

Student Missing

Student Missing: పటాన్‌చెరులో బీ ఫార్మసీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గీతం యూనివర్సిటీలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రోషిని అదృశ్యం అయ్యింది.. దీంతో, కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.. సంక్రాంతి సెలవులు కావడంతో.. ఈ నెల 13 తేదీన సంక్రాంతి సెలవుల కోసం బాబాయి ఇంటికి వెళ్తున్నానంటూ యూనివర్సిటీ నుంచి వెళ్లిపోయింది విద్యార్థిని.. అదేరోజు బాబాయి ఇంటికి చేరుకున్న ఆమె.. ఇక, 16వ తేదీన బాబాయి ఇంటి నుంచి కళాశాలకు వెళ్తున్నాను అని చెప్పి బయల్దేరింది.. అయితే.. 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆమె ఎక్కడ ఉన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది..

Read Also: Oscars: మరి కొన్ని గంటల్లో నామినేషన్స్ అనౌన్స్మెంట్… అందరి దృష్టి RRR పైనే

కానీ, ఈ నెల 22వ తేదీన టాంజానియాలో ఉన్న తన తండ్రికి రాముకు ఫోన్ చేసింది.. తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్‌ కట్‌ చేసింది.. దీంతో, ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. యూనివర్సిటీకి ఫోన్‌ చేయగా.. 22వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయని తెలిపారు.. మళ్లీ రోషినికి ఫోన్‌ చేస్తే.. ఆమె ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసి ఉండడంతో.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. దీనిపై పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.. కేసు నమోదు చేసిన పోలీసులు.. విద్యార్థిని అదృశ్యంపై దర్యాప్తు ప్రారంభించారు.. 16వ తేదీన బాబాయ్‌ ఇంటి నుంచి వెళ్లిపోయిన విద్యార్థిని.. అసలు ఎక్కడికి వెళ్లింది..? ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తండ్రికి ఫోన్‌ చేసి చెంపాల్సినంత కష్టం ఏమి వచ్చింది..? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Read Also: IT layoffs: భారతీయుల్లో కలవరం.. అమెరికాలో ఊడుతున్న ఉద్యోగాల్లో మనోళ్లే అధికం.. హెచ్-1బీ వీసాదారుల్లో ఆందోళన

Exit mobile version