Oscars: మరి కొన్ని గంటల్లో నామినేషన్స్ అనౌన్స్మెంట్… అందరి దృష్టి RRR పైనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ లో ప్రతి ఫిల్మ్ మేకర్ కి, ప్రతి యాక్టర్ కి, ప్రతి టెక్నిషియన్ కి ఉండే ఒక కల ‘ఆస్కార్’. ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ గెలుచుకుంటే చరిత్రలో నిలిచిపోతమని ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతూ ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రతి కేటగిరికి టాప్ లెవల్ అవార్డ్ గా పరిగణించే ఆస్కార్స్ అవార్డ్ అనౌన్స్మెంట్ ఈసారి మార్చ్ 12న చెయ్యనున్నారు. మార్చ్ 12న అవార్డ్ గెలవడానికి రేస్ లో ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని ‘ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్’ రూపంలో ఈరోజు అనౌన్స్ చెయ్యనున్నారు. ఇప్పటివరకూ బయటకి వచ్చిన ప్రిడిక్షన్స్ ని పక్కన పెడితే, ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఆస్కార్ రేసులో ఎవరు ఉన్నారు? ఏ సినిమా ఉంది అనే విషయం అఫీషియల్ గా తెలియనుంది. ఈ అనౌన్స్మెంట్ లైవ్ స్ట్రీమింగ్ ని ‘oscars.org’, ‘abc.com’, ‘hulu tv’, ‘academy’కి సంబంధించిన అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
95వ ఆస్కార్స్ పై ఈసారి ఎక్కువగా ఇండియాన్స్ దృష్టి పెట్టారు. అందుకు కారణం ఆర్ ఆర్ ఆర్ సినిమా రేసులో ఉండడమే. గోల్డెన్ గ్లోడ్ అవార్డ్ గెలుచుకోని ఆస్కార్ ఆశలని మరింత పెంచిన ఆర్ ఆర్ ఆర్ మూవీ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ గెలుస్తుందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ కేటగిరిలో, ఆర్ ఆర్ ఆర్ బెస్ట్ మూవీ కేటగిరిలో ఆస్కార్ నామినేట్ అవుతుందని ప్రపంచ సినీ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో ఈరోజు సాయంత్రం క్లారిటీ రానుంది. బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్ కేటగిరిల్లో అవార్డ్ రావడం కష్టమే కానీ ఒకవేళ నామినేట్ అయితే మాత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కొత్త శకం మొదలయ్యినట్లే.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!