ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ రోగి చేతులు, కాళ్లను కట్టేసి.. అతడిని చికిత్స చేసే రూంలో కాకుండా.. వేరే వార్డులో ఉంచి అతడి భోజనం పెడుతున్నారు. అయితే ఆసుపత్రి సిబ్బంది మాత్రం అతడి మానసిక స్థితి బాగాలేదని వెల్లడించారు. కానీ అతడి డయాబెటిస్ మాత్రమే ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో అతడిని లక్నోలోని ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే మార్గమధ్యలో రోగి మరణించాడు.
Read Also: Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ గా టీవీ నటి, యాంకర్
పూర్తి వివరాల్లోకి వెళితే.. అయోధ్యకు చెందిన ఓ డయాబెటిస్ పేషెంట్ ను అత్యంద దారుణంగా కాళ్లు చేతులు కట్టేంసి.. వైద్యం చేయనటువంటి రూంలో అతడి బంధించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నవంబర్ 8వ తేదీ ఉదయం రోగిని దర్శన్ నగర్ మెడికల్ కాలేజీకి రిఫర్ చేసినట్లు సిబ్బంది తెలిపింది. రోగిని అపస్మారక స్థితిలోకి తీసుకువచ్చారని .. అతను పిచ్చివాడు కాదని.. ఎమర్జెన్సీ ఇన్ ఛార్జ్ డాక్టర్ వినోద్ కుమార్ ఆర్య తెలిపారు. అతడు కేవలం.. దీర్ఘకాలిక మద్యపానం, డయాబెటిస్‌తో బాధపడుతున్నాడని అన్నారు.
Read Also:Cash Found in Smuggler’s House: ఓ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు.. లెక్కపెట్టలేక అలసిపోయిన పోలీసులు
రోగి మేనల్లుడు రాహుల్ కూడా తన మామకు పిచ్చి లేదని, డయాబెటిస్ ఉందని తెలిపాడు. డిశ్చార్జ్ తర్వాత లక్నోకు వెళ్లే దారిలో అతను మరణించాడని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
अयोध्या: जिला अस्पताल में हुआ अमानवीय बर्ताव
➡निष्प्रयोज्य वार्ड में मरीज को बेड से बांधा
➡बांध कर खाने की थाली रखी सामने
➡मरीज घंटो रहा तड़पता, नहीं पहुंचा स्टाफ
➡चिकित्सा अधीक्षक डॉ. अजय ने लिया संज्ञान
➡स्टाफ चेतावनी देते हुए मामले को बताया
➡मरीज मानसिक रूप से अस्वस्थ… pic.twitter.com/flYz3nXZ3T— भारत समाचार | Bharat Samachar (@bstvlive) November 9, 2025