Site icon NTV Telugu

Crime News: భార్యతో వీడియో కాల్‌లో గొడవ.. గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

Up Gun

Up Gun

నోయిడాలోని రబుపురా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం ఆయన తన భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడుతుండగా గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మహ్మద్‌పూర్ గ్రామం సమీపంలో పోలీస్ స్టేషన్ జీపులో ప్రభుత్వ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also: Manish Sisodia: కొడుకు కాలేజీ ఫీజుల కోసం అడుక్కున్న: మనీష్ సిసోడియా

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని.. వెంటనే తన భర్త దగ్గరకు వెళ్లాలని మృతుడి భార్య పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జికి సమాచారం అందించింది. ఈ క్రమంలో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అప్పటికే కానిస్టేబుల్‌ కాల్చుకుని పడి ఉన్నాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కాగా.. కుటుంబ సమస్యల కారణంగా కానిస్టేబుల్ చాలా రోజులుగా ఒత్తిడికి గురవుతున్నాడని పోలీసులు తెలిపారు.

Read Also: Bhagwant Mann: ఖలిస్తానీ మద్దతుదారు అమృత్ పాల్ సింగ్ నుంచి పంజాబ్ సీఎంకి ప్రాణహాని..

కాగా.. ఈ ఘటన 21 అర్థరాత్రి చోటు చేసుకుంది, కానిస్టేబుల్ అంకుర్ రాఠి (28) ఒంటరిగా మొహమ్మద్‌పూర్ గ్రామానికి చెందిన పోలీస్ జీపులో ఆయిల్ నింపడానికి వెళ్లి ఆత్మహ్య చేసుకున్ననట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ అంకుర్ రాఠీ కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నట్లు విచారణలో పోలీసులకు తెలిసిందన్నారు. అతను 2016 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. ఆత్మహత్య ఘటనపై అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version