NTV Telugu Site icon

Naveen Case: నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. నిందితుడు కృష్ణ మిస్సింగ్?

Naveen Case

Naveen Case

Another Twist In Naveen Case: తన స్నేహితుడు నవీన్‌ను హరిహర కృష్ణ అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో అనూహ్యమైన ట్విస్టులు ఒక్కొక్కట్టిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే తాను నవీన్‌ను చంపానంటూ కృష్ణ పెట్టిన మెసేజ్‌కి గాను ‘గుడ్ బాయ్’ అంటూ అమ్మాయి రిప్లై ఇచ్చినందుకు.. ఆమెను ఈ కేసులో నిందితురాలిగా చేర్చబోతున్నారు. ఇప్పుడు ఈ కేసులో మరో ఊహించని ట్విస్ట్ తెరమీదకి వచ్చింది. ముసారాంబాగ్‌లో తన అక్క, బావలతో ఉంటోన్న నిందితుడు కృష్ణ.. నవీన్‌ను చంపిన తర్వాత ఇంటికి వెళ్లేదు. ఫోన్ కూడా స్విచ్చాఫ్‌గా రావడంతో.. మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఈనెల 23వ తేదీన కృష్ణ కనిపించడం లేదంటూ అతని బావ లక్ష్మినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే.. ఆ మరుసటి రోజే అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల ఎదుట హరిహర కృష్ణ లొంగిపోయాడు.

Harish Rao: కూల్చుతామంటున్న బీజేపీ కావాలా.. నిలబెట్టే కేసీఆర్ కావాలా?

ఇదిలావుండగా.. నవీన్, హరిహర కృష్ణ ఇంటర్మీడియట్ నుంచి స్నేహితులు. ఆ సమయంలో కృష్ణ తన క్లాస్‌మేట్ అయిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అయితే.. కొన్ని కారణాల వల్ల వాళ్లిద్దరు విడిపోయారు. కొంతకాలం తర్వాత ఆ అమ్మాయికి నవీన్ దగ్గరయ్యాడు. వీళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, అది ప్రేమగా మారింది. ఈ విషయం తెలుసుకున్న హరిహర కృష్ణ కోపాద్రిక్తుడయ్యాడు. దీంతో.. నవీన్‌ని చంపాలని మూడు నెలల నుంచి ప్లాన్ చేశాడు. సరైన సమయం కోచి వేచి చూశాడు. ఈ నెల 17వ తేదీన అతడు కలవడంతో, ఆరోజే చంపేందుకు ప్లాన్ చేశాడు. తొలుత కొన్ని చోట్ల తిరిగారు. హాస్టల్‌కు డ్రాప్ చేసే సమయంలో.. ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, అత్యంత కిరాతకంగా నవీన్‌ని కృష్ణ హతమార్చాడు. పెదాలు, వేళ్లు, చేతులు, గుండె, తల.. ఇలా అన్ని భాగాల్ని వేరు చేశాడు. చివరికి మర్మాంగాన్ని సైతం కట్ చేశాడు. ఈ భాగాలను ఆ అమ్మాయికి పంపుతూ మెసేజ్ చేశాడు. అందుకు ఆ యువతి.. ‘అవునా, సరే, గుడ్ బాయ్’ అంటూ మెసేజ్ చేసింది. అనంతరం అతడు పోలీసుల ముందు లొంగిపోయాడు. తన ప్రియురాలితో సాన్నిహిత్యంగా ఉండటం వల్లే తాను నవీన్‌ని చంపానని నేరం అంగీకరించాడు.

Turkey Earthquake: 66 గంటలు 37 భూకంపాలు.. వణికిపోతున్న టర్కీ..

ఈ కేసు గురించి ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ మాట్లాడుతూ.. నవీన్ హత్య కేసుపై విచారణ వేగవంతం చేశామన్నారు. నిందితుడు హరిహర కృష్ణను అరెస్ట్ చేశామని, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ చేస్తున్నామని తెలిపారు. హరిహర కృష్ణ, నవీన్ మంచి స్నేహితులని.. తన ప్రియురాలితో నవీన్ సన్నిహితంగా ఉంటున్నాడని కోపం పెంచుకున్నాడని చెప్పారు. దీంతో పార్టీ పేరుతో పిలిపించి, నవీన్‌ను దారుణంగా హత్య చేశాడని వివరించారు. ఈ హత్య కేసులో అమ్మాయి ప్రమేయం ఉందా లేదా అనేది విచారణ చేస్తామన్నారు. ఈ కేసులో హరిహరతో పాటు ఇతర వ్యక్తుల ప్రమేయం అయితే ఇంకా వెలుగులోకి రాలేదని స్పష్టం చేశారు. మరోవైపు.. హరిహర కృష్ణను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించి, జైలుకు తరలించారు.