Naveen Case: నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. నిందితుడు కృష్ణ మిస్సింగ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Another Twist In Naveen Case: తన స్నేహితుడు నవీన్‌ను హరిహర కృష్ణ అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో అనూహ్యమైన ట్విస్టులు ఒక్కొక్కట్టిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే తాను నవీన్‌ను చంపానంటూ కృష్ణ పెట్టిన మెసేజ్‌కి గాను ‘గుడ్ బాయ్’ అంటూ అమ్మాయి రిప్లై ఇచ్చినందుకు.. ఆమెను ఈ కేసులో నిందితురాలిగా చేర్చబోతున్నారు. ఇప్పుడు ఈ కేసులో మరో ఊహించని ట్విస్ట్ తెరమీదకి వచ్చింది. ముసారాంబాగ్‌లో తన అక్క, బావలతో ఉంటోన్న నిందితుడు కృష్ణ.. నవీన్‌ను చంపిన తర్వాత ఇంటికి వెళ్లేదు. ఫోన్ కూడా స్విచ్చాఫ్‌గా రావడంతో.. మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఈనెల 23వ తేదీన కృష్ణ కనిపించడం లేదంటూ అతని బావ లక్ష్మినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే.. ఆ మరుసటి రోజే అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల ఎదుట హరిహర కృష్ణ లొంగిపోయాడు.
Harish Rao: కూల్చుతామంటున్న బీజేపీ కావాలా.. నిలబెట్టే కేసీఆర్ కావాలా?
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ఇదిలావుండగా.. నవీన్, హరిహర కృష్ణ ఇంటర్మీడియట్ నుంచి స్నేహితులు. ఆ సమయంలో కృష్ణ తన క్లాస్‌మేట్ అయిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అయితే.. కొన్ని కారణాల వల్ల వాళ్లిద్దరు విడిపోయారు. కొంతకాలం తర్వాత ఆ అమ్మాయికి నవీన్ దగ్గరయ్యాడు. వీళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, అది ప్రేమగా మారింది. ఈ విషయం తెలుసుకున్న హరిహర కృష్ణ కోపాద్రిక్తుడయ్యాడు. దీంతో.. నవీన్‌ని చంపాలని మూడు నెలల నుంచి ప్లాన్ చేశాడు. సరైన సమయం కోచి వేచి చూశాడు. ఈ నెల 17వ తేదీన అతడు కలవడంతో, ఆరోజే చంపేందుకు ప్లాన్ చేశాడు. తొలుత కొన్ని చోట్ల తిరిగారు. హాస్టల్‌కు డ్రాప్ చేసే సమయంలో.. ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, అత్యంత కిరాతకంగా నవీన్‌ని కృష్ణ హతమార్చాడు. పెదాలు, వేళ్లు, చేతులు, గుండె, తల.. ఇలా అన్ని భాగాల్ని వేరు చేశాడు. చివరికి మర్మాంగాన్ని సైతం కట్ చేశాడు. ఈ భాగాలను ఆ అమ్మాయికి పంపుతూ మెసేజ్ చేశాడు. అందుకు ఆ యువతి.. ‘అవునా, సరే, గుడ్ బాయ్’ అంటూ మెసేజ్ చేసింది. అనంతరం అతడు పోలీసుల ముందు లొంగిపోయాడు. తన ప్రియురాలితో సాన్నిహిత్యంగా ఉండటం వల్లే తాను నవీన్‌ని చంపానని నేరం అంగీకరించాడు.
Turkey Earthquake: 66 గంటలు 37 భూకంపాలు.. వణికిపోతున్న టర్కీ..
ఈ కేసు గురించి ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ మాట్లాడుతూ.. నవీన్ హత్య కేసుపై విచారణ వేగవంతం చేశామన్నారు. నిందితుడు హరిహర కృష్ణను అరెస్ట్ చేశామని, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ చేస్తున్నామని తెలిపారు. హరిహర కృష్ణ, నవీన్ మంచి స్నేహితులని.. తన ప్రియురాలితో నవీన్ సన్నిహితంగా ఉంటున్నాడని కోపం పెంచుకున్నాడని చెప్పారు. దీంతో పార్టీ పేరుతో పిలిపించి, నవీన్‌ను దారుణంగా హత్య చేశాడని వివరించారు. ఈ హత్య కేసులో అమ్మాయి ప్రమేయం ఉందా లేదా అనేది విచారణ చేస్తామన్నారు. ఈ కేసులో హరిహరతో పాటు ఇతర వ్యక్తుల ప్రమేయం అయితే ఇంకా వెలుగులోకి రాలేదని స్పష్టం చేశారు. మరోవైపు.. హరిహర కృష్ణను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించి, జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!