SI Rajasekhar case: ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యతాయుత పదవిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి బుద్ధి గడ్డి తింది. ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఉన్న పోలీస్ ఉద్యోగం కాస్తా ఊడింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా అడవి బ్రాహ్మణ పల్లి తండాకు చెందిన గిరిజన మహిళ ఉద్యోగి వ్యక్తిగత కారణాలతో భర్తతో విడాకులు తీసుకుంది. విడాకుల సందర్భంగా తనకు తగిన న్యాయం జరగలేదని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఈ క్రమంలో కానీ పట్నం ఎస్ఐ రాజశేఖర్‌కు తన గోడు వెల్లబోసుకుంది. ఐతే అతను సానుకూలంగా స్పందించకపోగా.. ఆమెపై కన్నేశాడు. ఈ క్రమంలోనే ఫోన్ నంబర్ తీసుకున్నాడు.
READ MORE: Bandi Sanjay: నక్సలైట్లు దేశ భక్తులని అంటున్నారు..
రాజశేఖర్ అసభ్య వీడియో కాల్ రికార్డ్స్ ఇచ్చిన మహిళ
కేసు వంకతో ఆమెకు నిత్యం ఫోన్ చేసేవాడు రాజశేఖర్. అందులో అసభ్యంగా మాట్లాడేవాడు. లైంగికంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. ఏకంగా పలుమార్లు వీడియో కాల్ కూడా చేశాడు. ప్రయివేట్ పార్ట్స్ చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో అసలే వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్న మహిళకు మరింత నరకం కనిపించింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులకు విషయం తెలిపింది. ఎస్సై రాజశేఖర్ అసభ్య వీడియో కాల్ రికార్డ్స్ కూడా వారి ముందు ఉంచింది.
విచారణలో బయటపడ్డ ఎస్ఐ రాజశేఖర్ అసభ్య వ్యవహారం
ఈ విషయంపై స్పందించిన జిల్లా ఎస్పీ వీ.రత్న ఎస్ఐ రాజశేఖర్‌ను వెంటనే వీఆర్‌కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. విచారణలో ఎస్ఐ రాజశేఖర్ అసభ్య వ్యవహారం నిజమని నిగ్గుతేలింది. ఫలితంగా ఆయన ఉద్యోగం ఊడింది. అంతే కాదు భార్యతో గొడవ పడి.. కానీపట్నంలోనే ఓ అద్దెభవనంలో బస చేస్తూ ఈవ్ టీజరయ్యాడని ప్రచారం జరుగుతోంది. ఎస్పీ రత్న.. సకాలంలో స్పందించి ఓ మహిళకు జరిగిన అన్యాయంపై పోలీసులను కూడా వదిలిపెట్టనందుకు శ్రీసత్యసాయి జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు.
READ MORE: Illegal Affair : అడ్డొస్తే రక్తపాతమే.. అక్రమ సంబంధాల నెత్తుటి కథలు..