Crime: అక్రమ సంబంధం అనుమానంతో భార్య, కుమార్తెలపై యాసిడ్ దాడి..
- అక్రమ సంబంధం అనుమానంతో యాసిడ్ దాడి..
- భార్య, కుమార్తెలపై యాసిడ్ పోసి పారిపోయిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలో జరిగింది. తిక్రి గ్రామంలో ఈ దాడి జరిగింది. భర్త రామ్ గోపాల్ శుక్రవారం రాత్రి తన భార్య 39 ఏళ్ల రాంగుని, కుమార్తెలైన 16 ఏళ్ల నేహా, 23 ఏళ్ల రచితపై యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో వీరంతా తీవ్రంగా గాయపడ్డారు.
Read Also: Assam: భార్య తల నరికి, తలతో పోలీస్ స్టేషన్‌కు..
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
బాధితురాలు తన ఇద్దరు కుమార్తెలతో, ఒక కొడుకుతో తిక్రి గ్రామంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె భర్త రామ్ గోపాల్ షహాబాద్ హర్దోయ్‌లో నివసిస్తున్నాడని ఏఎస్పీ దేవేంద్ర కుమార్ ఆదివారం తెలిపారు. శుక్రవారం రాత్రి రాంగుని, ఆమె కుమార్తెలు నిద్రిస్తున్న సమయంలో, రామ్ గోపాల్ గోడ దూకి ఇంట్లోకి చొరబడి, వారిపై యాసిడ్ దాడి చేసినట్లు వెల్లడించారు. సంఘటన జరిగిన సమయంలో రాంగుని కుమారుడు అషు స్నేహితుడితో కలిసి ఉండటంతో అతడు దాడి నుంచి బయటపడ్డాడు.
ఈ సంఘటనపై కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి మద్యానికి బానిసయ్యాడని, దీని కారణంగానే షహాబాద్ ప్రాంతంలోని తన వ్యవసాయ భూమిని విక్రయించినట్లు అతను పోలీసులకు వెల్లడించాడు. దీని తర్వాత రాంగుని తన పిల్లలతో కలిసి తిక్రి గ్రామానికి వెళ్లింది. అయితే, తరుచుగా రామ్ గోపాల్ భార్య రాంగుని అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానిస్తుండే వాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు, అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!