Selfie Addict: స్మార్ట్ ఫోన్ వచ్చిన దగ్గరనుంచి ప్రతి ఒక్కరికి సెల్ఫీ పిచ్చి ఎక్కువైపోయింది. ప్లేస్ ఎలాంటిదైనా ఫోటో దిగాల్సిందే. ముఖ్యంగా డేంజరస్ ప్లేసెస్ అని తెలిసినా అస్సలు వదలడం లేదు. సెల్ఫీ పిచ్చిలో ముందు వెనుక చూసుకోకుండా చావును కొనితెచ్చకుంటున్నారు. తాజాగా ఒక యువకుడు ఈ సెల్ఫీ పిచ్చిలో పడి సంసారానికి పనికిరాకుండా పోయాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోను హుబ్బళ్ళి నగరంలో వినాయక్ అనే స్టూడెంట్ కు సెల్ఫీలు అంటే మోజు. నిత్యం సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక .. ఆ ప్రాంతంలో శిరిడి నగర్ రైల్వే స్టేషన్ బాగా ఫేమస్.
ఇక అక్కడికి వెళ్లి ఫోటోలు తీసుకోవాలని వినాయక్ అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా రైల్వే స్టేషన్ కు వెళ్లి ఫోటోలు దిగుతూ ఉన్నాడు. ఇక ఒక చోట హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్నాయని చూసుకోకుండా వాటికి దగ్గరగా వెళ్లి సెల్ఫీలు దిగడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతడికి విద్యుత్ తీగలు తగిలి షాక్ తగిలింది. ఒక్కసారిగా ఆ షాక్ శరీరమంతా వ్యాపించి అతని మర్మాంగం కాలిపోయింది. వెంటనే అతడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా ప్రాణాలతో బయటపడ్డాడు కానీ సంసారానికి పనికిరాకుండా పోయాడని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన కర్ణాటకలో సంచలనం సృష్టిస్తోంది