Site icon NTV Telugu

S*exual Harassment: ఉద్యోగం కోసం వెళితే.. పోర్న్‌లో నటించాలని చిత్రహింసలు..!

West Bengal

West Bengal

S*exual Harassment: పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. బెంగాల్‌కు చెందిన తల్లీ శ్వేతాఖాన్‌, కొడుకు ఆర్యన్‌ఖాన్‌లు ఓ యువతిని ఉద్యోగం పేరుతో ట్రాప్‌ చేసి.. ఆ తర్వాత అశ్లీల చిత్రాల్లో నటించాలని, బార్‌ డ్యాన్సర్‌గా పని చేయాలని ఒత్తిడి చేయగా దానికి ఆమె అంగీకరించకపోవడంతో గత 6 నెలలుగా ఓ ఫ్లాట్‌లో బంధించి చిత్రహింసలకు పాల్పడ్డారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకొని స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బటయకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుంది.

Read Also: TGSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్.. 20 శాతం పెరిగిన బస్ పాస్ రేట్లు

అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగాల్‌కు చెందిన తల్లీ, కొడుకులు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ ముసుగులో పోర్న్ వీడియోల రాకెట్‌ను, దానికి సంబంధించిన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌ను నడిపిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇందులో భాగంగానే ఎక్కువ జీతం ఆశ చూపి నిరుద్యోగ అమ్మాయిలను ఉద్యోగం పేరుతో నమ్మించి.. ఆ తర్వాత అశ్లీల చిత్రాల్లో నటించాలని బలవంతం చేసేవారు అని చెప్పుకొచ్చారు. 6 నెలల క్రితం 24 ఉత్తర పరగణా జిల్లాకు చెందిన ఓ యువతి జాబ్ కోసం ఫేస్‌బుక్‌లో ఆర్యన్‌ను సంప్రదించింది.. హౌరాలోని తమ ఇంటికి వస్తే ఉద్యోగం గురించి చర్చించి ఇప్పిస్తామని అతడు చెప్పగా.. సదరు యువతి వారి ఇంటికి వెళ్లింది.

Read Also: Badshah : ఆమెతో పిల్లల్ని కంటా బ్రో.. నోరుజారిన స్టార్ సింగర్

ఇక, ఆర్యన్‌ అతడి తల్లి శ్వేతతో కలిసి ఆ యువతిని బార్‌ డాన్సర్‌ వృత్తిలోకి దించడానికి ట్రై చేశారు. కానీ, దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెపై దాడికి దిగారు. అనంతరం ఆ యువతి మొబైల్‌ తీసుకుని, ఓ ఫ్లాట్‌లో ఒంటరిగా బంధించారు. 6 నెలల పాటు తనను ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టి, హింసించారని.. 4 రోజులకు ఒక్క సారే భోజనం పెట్టేవాళ్లని బాధితురాలు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు.. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

Exit mobile version