Pithapuram Crime: కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణమైన ఘటన జరిగింది.. ఇందిరానగర్ లో మైనర్ బాలికకు మద్యం పట్టించి.. ఆపై అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు.. నిందితుడిగా పేర్కొంటున్న మాజీ కౌన్సిలర్ భర్త జాన్ బాబును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.. జాన్ బాబుకు మరో మహిళ సహకరించినట్లుగా తెలుస్తుంది.. బలవంతంగా ఆటో ఎక్కించి డంపింగ్ యార్డ్ దగ్గరికి తీసుకుని వెళ్ళినట్లు చెబుతున్నారు మైనర్ బాలిక బంధువులు.. మరోవైపు.. అపస్మారక స్థితిలో ఉన్న బాలిక ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతుంది, పోలీసుల అదుపులో జాన్ బాబుతో పాటు మరో మహిళ ఉన్నారు.. పోలీసుల విచారణలో ఇద్దరూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారట.. జాన్ బాబు ఆటో ఎందుకు ఎక్కించుకున్నావంటే.. మామూలుగానే ఎక్కించుకున్నాను.. మీరు ఏం చేసినా పర్వాలేదని సమాధానం చెబుతున్నట్టుగా తెలుస్తోంది..
Read Also: T20 World Cup 2024: ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు రెండో విజయం.. మరొక్క గెలుపే!
అయితే, సోమవారం రోజు ఆటో నడుపుకుంటూ వచ్చిన జాన్ బాబు.. మరో మహిళ.. ఓ కాగితం చూపించి మైనర్ అయిన దళిత బాలికను అడ్రస్ అడిగారు.. ఆ బాలిక అడ్రస్ చెబుతుండగా.. ఆమెపై మత్తు మందు స్ర్పే చేసి ఆటోలో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు.. పిఠాపురం శివారు మాధవపురం రోడ్డులోని డంపింగ్‌యార్డు వద్దకు తీసుకువెళ్లారు. ఇక, అక్కడకు తీసుకెళ్లిన తర్వాత బాలికకు బలవంతంగా మద్యం తాగించి.. సదరు వ్యక్తి ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో కూడా తెలియనా ఆ బాలిక షాక్‌లో అపస్మారక స్థితిలో వెళ్లిపోయింది.. ఆ తర్వాత బాలికను మళ్లీ ఆటో ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా.. గమనించిన ప్లాస్టిక్ వస్తువులు సేకరించే మహిళ.. వారిని నిలదీసింది.. వెంటనే బాలిక బంధువులకు సమాచారం అందించింది. బాలిక కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి కిడ్నా్‌పకు పాల్పడిన వ్యక్తిని, మహిళను పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన స్థానకంగా కలకలం సృష్టించింది..