NTV Telugu Site icon

Crime News: శృంగారానికి నిరాకరించినందుకు మహిళను హత్య చేసిన ఓ వ్యక్తి..

Kolkata Murder

Kolkata Murder

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ కోల్‌కతాలోని టోలీగంజ్ ప్రాంతంలో ఒక చెత్త కుప్పలో కట్ చేసి ఉన్న మహిళ తల లభ్యమైంది. కాగా.. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు తన బావని 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అతిఉర్‌ రెహమాన్‌ లస్కర్‌గా గుర్తించారు. తనతో శృంగారానికి నిరాకరించినందుకు మహిళను హత్య చేశాడు. కోల్‌కతా పోలీసులు దక్షిణ 24 పరగణాస్‌లోని డైమండ్ హార్బర్‌లోని అతని స్వగ్రామం బసుల్దంగాలో అరెస్టు చేశారు.

Amit Shah: అదానీ లంచం ఆరోపణలపై తొలిసారిగా స్పందించిన అమిత్ షా..

గత రెండేళ్లుగా భర్తతో విడిగా ఉంటున్న మహిళను హత్య చేసినట్లు భవన నిర్మాణ కార్మికుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. డీసీపీ (సౌత్ సబర్బన్) బిదిషా కలిత మాట్లాడుతూ.. శుక్రవారం గ్రహం రోడ్‌కు సమీపంలోని చెత్తకుప్పలో మహిళ యొక్క కత్తిరించిన తల, శనివారం రీజెంట్ పార్క్ ప్రాంతంలోని చెరువు సమీపంలో ఆమె మొండెం, శరీరం కనుగొనట్లు చెప్పారు. ఆ మహిళ రీజెంట్ పార్క్‌లోని ఓ ఇంట్లో పనిచేస్తుండేది. ఈ క్రమంలో.. లస్కర్‌తో కలిసి ఆమె ప్రతిరోజూ పనికి వెళ్లేది. నిందితుడు ఆమెతో సంబంధాలు పెట్టుకోవాలని భావించాడని.. అయితే ఆమె అతని ప్రతిపాదనను తిరస్కరించిందని డీసీపీ తెలిపారు. ఈ క్రమంలో.. లస్కర్ ఆగ్రహానికి గురయ్యాడు. ఇదిలా ఉంటే.. ఒక వారం క్రితం నుంచి ఆమె తన బావతో దూరంగా ఉంటుది. అంతేకాకుండా.. తన ఫోన్ నంబర్‌ను కూడా మహిళ బ్లాక్ చేసింది. ఇది అతనికి మరింత కోపం తెప్పించింది.

Amit Shah: భారత్ త్వరలోనే నక్సలిజం నుండి విముక్తి పొందుతుంది..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం ఆమెను తనతో పాటు నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లాడు. అక్కడే ఆమె గొంతు నులిమి చంపి ఆపై తలను, మొండాన్ని వేరు చేశాడు. అంతేకాకుండా.. మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికి దూరంగా పడేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉన్నట్టు కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా.. ఆ ప్రాంతంలో తెగిపడిన తల కనిపించడంతో స్థానికులలో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు.. శుక్రవారం ఉదయం గోల్ఫ్‌ గ్రీన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రాహం రోడ్డులోని ట్యాంక్‌లో తల తెగిపడిన ప్లాస్టిక్‌ సంచిని స్థానికులు గుర్తించారు. PTI నివేదిక ప్రకారం.. శరీర భాగాన్ని కనుగొన్న వెంటనే, తదుపరి విచారణ కోసం పోలీసులు దానిని MR బంగూర్ ఆసుపత్రికి పంపారు. కోల్‌కతా పోలీసులు ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, నరికిన తలను అక్కడ ఎవరు పడవేశారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు.. ఘటనా స్థలం నుంచి సంబంధిత నమూనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తెగిన తలపై గాయాలు, రక్తపు మరకలు కూడా ఉన్నాయని పోలీసులు చెప్పారు. శరీర భాగాలను గుర్తించేందుకు పోలీసులు స్నిఫర్ డాగ్‌ను కూడా రంగంలోకి దించారు.

Show comments