తమిళనాడు రాజధాని చెన్నైలో సంచలన హత్య ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ వ్యక్తి సె** వర్కర్ మహిళను సుత్తితో కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా కోసి సంచిలోనింపి పాడేశాడు. నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఏం జరిగిందంటే.. సెప్టెంబర్ 18న చెన్నైలోని తొరైపాక్కం సమీపంలో పాడుబడిన ట్రాలీలో మహిళ మృతదేహం లభ్యమైంది. సమీపంలో ఇళ్ల నిర్మాణ పనులు చేస్తున్న కూలీలు ట్రాలీపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాలీపై ఉన్న బ్యాగ్‌ని తెరిచి చూడగా అందులో మహిళ మృతదేహం కనిపించింది.
READ MORE: Balineni Srinivasa Reddy: కాసేపట్లో జనసేన అధినేతతో బాలినేని భేటీ..
మృతురాలిని 32 ఏళ్ల దీపగా గుర్తించారు
మృతదేహం పరిస్థితి చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. హత్యానంతరం మహిళను బ్యాగులో నింపేందుకు వీలుగా ముక్కలుగా నరికాడు. ఈ కేసులో చెన్నై పోలీసులు వేగంగా వ్యవహరించి నిందితులను గురువారం అరెస్టు చేశారు. మృతి చెందిన మహిళను 32 ఏళ్ల దీపగా గుర్తించారు. ఆమె మనాలి వాసిగా గుర్తించారు. ఆమె ఒక సె** వర్కర్ అని పోలీసుల తేల్చారు.
READ MORE: Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
బ్రోకర్ సలహా మేరకు దీప తోరైపాక్కం వెళ్లింది..
బ్రోకర్ సలహా మేరకు దీపా తోరైపాక్కం వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో సోదరుడు ఫోన్ చేయగా మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఓ యాప్ ద్వారా లొకేషన్ కనుగొని తోరైపాక్కంలో ఉన్నట్లు గుర్తించాడు. తన సోదరి మిస్సింగ్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం తోరైపాక్కం పోలీసులు ట్రాలీలో దీప మృతదేహాన్ని గుర్తించారు. ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. దీంతో శివగంగై జిల్లాకు చెందిన ప్రధాన అనుమానితుడు మణికందన్ అని సమాచారం అందింది. మణికందన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో… మణికందన్ మొదట మహిళను హత్య చేసినట్లు ఖండించాడు. పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో.. హత్య చేసింది తానేనని అంగీకరించాడు. డబ్బుల విషయంలో దీపతో గొడవ జరిగిందని చెప్పారు. ఈ గొడవలో దీపను సుత్తితో కొట్టి హత్య చేశాడు.