Hyderabad: హయత్ నగర్ కుంట్లూర్ గ్రామంలో విషాదం.. మూడేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన బస్సు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: ఓ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. అక్కను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తాతయ్యతో కలిసి సంతోషంగా వెళ్లిన ఓ చిన్నారి జీవితం విషాదంగా ముగిసింది. చిన్నారి పైన నుండి బస్సు వెళ్లడంతో ఓ ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ శివారు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివారాలోకి వెళ్తే.. లక్ష్మారెడ్డి పాలెం లోని క్యాండోర్ షైన్ స్కూల్ బస్సు కుంట్లూరు గ్రామానికి నిత్యం విద్యార్థులను ఎక్కించుకునేదు వస్తుంది. అలానే ఈ రోజు ఉదయం కూడా స్కూల్ బస్సు కుంట్లూరు గ్రామానికి వచ్చింది. కాగా అదే పాఠశాలలో చదువుతున్న ఆ గ్రామినికి చెందిన ఓ విద్యార్థినిని స్కూల్ బస్సు ఎక్కించేందుకు హర్షపవన్ ఓ మూడు సంవత్సరాల బాలుడు తన తాతయ్యతో కలిసి బస్సు దగ్గరకు వెళ్ళాడు. కాగా ఆ బాలుడి అక్క బస్సు ఎక్కింది. అయితే అనుకొకుండా ఆ చిన్నారి బస్సు కింద పడ్డాడు. ఇది గమనించని డ్రైవర్ హర్షపవన్ పైన నుండి బస్సును పోనిచ్చాడు.
Read also:Rinku Singh: ఆకాశమే హద్దుగా చెలరేగిన రింకూ.. కేవలం 33 బంతుల్లోనే..!
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
దీనితో చిన్నారి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందారు. దీనితో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు డ్రైవర్‌ను పట్టుకొని చితకబాదారు. గతం లోనూ ఇలాంటి ఘటనలు జరిగినవని అయిన స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. కుమారుడి మృతదేహాం వద్ద తల్లిదండ్రులు రోధించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..