UP: ఇన్‌స్టాలో వివాహితతో ప్రేమ.. హోటల్‌కు పిలిచి ప్రియుడు ఏం చేశాడంటే…!
- ఇన్‌స్టాలో వివాహితతో ప్రేమ
- పెళ్లి చేసుకోమనడంతో హోటల్‌కు పిలిచి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సాంప్రదాయంలో వైవాహిక జీవితం చాలా ప్రత్యేకమైంది. భార్యాభర్తల బంధాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. అలాంటి బంధాన్ని కొందరు క్షణిక సుఖం కోసం పచ్చని సంసారాలను కూల్చుకుంటున్నారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్నవాళ్లనే కడతేర్చేస్తున్నారు. ఇక కొందరైతే కామంతో కళ్లు మూసుకుపోయి.. వయసు పైబడిన వారు కూడా అడ్డదారులు తొక్కుతున్నారు. సోషల్ మీడియా ప్రభావమో.. లేదంటే పరిస్థితుల ప్రభావమో తెలియదు గానీ.. లేటు వయసులో ఒక మహిళ ప్రేమలో పడి ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: MLC Kavitha: మధ్యాహ్నం కవిత ప్రెస్‌మీట్.. బీఆర్ఎస్ నేతలే టార్గెటా?, ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పేనా?
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఫరూఖాబాద్‌కు చెందిన రాణి అనే మహిళ (52).. ఇన్‌స్టాగ్రామ్‌లో 26 ఏళ్ల అరుణ్ రాజ్‌పుత్‌తో ప్రేమలో పడింది. వయసును దాచిపెట్టి అతడితో లవ్‌లో పడింది. తొలుత ఆన్‌లైన్‌లో సంభాషణలు కొనసాగించారు. అనంతరం ఫరూఖాబాద్‌లో హోటళ్లలో కలుస్తుండేవారు. నలుగురు పిల్లలు ఉన్నారన్న విషయాన్ని దాచిపెట్టి రాజ్‌పుత్‌తో సంబంధాన్ని కొనసాగించింది. ఈ క్రమంలోనే రాజ్‌పుత్‌కు రూ.1.5 లక్షలు సాయం చేసింది.
ఇది కూడా చదవండి: Kadapa: వినాయకుడి విగ్రహంపై రప్పా.. రప్పా..!
ఇక ఇద్దరి మధ్య బంధం బలపడుతుండగా పెళ్లి చేసుకోవాలంటూ రాజ్‌పుత్‌పై రాణి ఒత్తిడి తెస్తోంది. అంతేకాకుండా తీసుకున్న డబ్బు కూడా తిరిగి ఇచ్చేయాలని కోరుతోంది. దీంతో ప్రియుడు ఒత్తిడికి గురయ్యాడు. ఆమెను అడ్డుతొలగించుకోవాలని ప్రణాళిక రచించాడు. ఆగస్టు 10న రాణిని మైన్‌పురికి పిలిచాడు. మళ్లీ అదే విషయాన్ని ఆమె ప్రస్తావించింది. పెళ్లి చేసుకోవాలని కోరింది. అంతేకాకుండా డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెంచింది. దీంతో కోపోద్రేకుడైన రాజ్‌పుత్.. రాణి గొంతు కోసి పరారయ్యాడు.
ఇది కూడా చదవండి: Trump: భారత్ టారిఫ్‌లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. వైట్‌హౌస్‌లో మీడియా ప్రశ్నకు సమాధానమిదే!
ఇక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మహిళ ఎవరనేది గుర్తించేందుకు పోస్టర్లను అతికించారు. అనంతరం ఫరూఖాబాద్‌లో తప్పిపోయిన ఫిర్యాదుతో పోల్చగా.. రాణి అని తేలింది. ఇక రాణి మొబైల్, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ప్రేమ వ్యవహారం బయటపడింది. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తుండగా బుధవారం అరెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయని.. ఫొటోలు, చాట్‌లు ఉన్నాయని చెప్పారు.
ఏడాదిన్నర క్రితం ఇద్దరి మధ్య ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడిందని.. అనంతరం హోటళ్లలో కలుస్తుండడంతో ఇద్దరి మధ్య బంధం ఏర్పడినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రియుడికి సాయం చేసిందని.. అలాగే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియుడు చంపేసినట్లుగా వెల్లడించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!