అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. బంగారం, గంజాయి, డ్రగ్స్ వేటినీ వదలడం లేదు. ఇతర దేశాల నుంచి స్మగ్లింగ్ ఎక్కువై పోతోంది. బెంగళూరు ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎయిర్‌పోర్ట్ కార్గో లో 5.3 కోట్ల విలువ చేసే 754 గ్రాముల హెరాయిన్ సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు.
READ ALSO గాఢ నిద్రలో భర్త.. ప్రియుడితో భార్య కామక్రీడలు.. ఆ శబ్దాలకు
దుబాయ్ నుండి బెంగుళూరు వచ్చిన ఓ పార్శిల్ లో డ్రగ్స్ గుర్తించిన కస్టమ్స్ బృందం తనిఖీలు చేసింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్ ను ఫైల్ ఫోల్డర్ మధ్య భాగంలో దాచి ప్యాకింగ్ చేసి పార్శిల్ ద్వారా బెంగుళూరుకు పంపారు కేటుగాళ్లు. విశ్వసనీయ సమాచారం మేరకు కార్గో లో పార్శిల్స్ పై నిఘా పెట్టారు కస్టమ్స్ అధికారులు. డ్రగ్స్ తో ఉన్న పార్శిల్ తీసుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. NDPSయాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. ఈ ముఠా వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు.