Site icon NTV Telugu

UP Crime: 7 ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారం..

Girl Rape

Girl Rape

UP Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారం చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం కొత్వాలీ ప్రాంతంలో ఏడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల వయసు ఉన్న ఇద్దరు బాలురు, బాలికను ప్రలోభపెట్టి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాలిక ఇంటికి తిరిగి వచ్చిందని, శనివారం ఆమె పరిస్థితి విషమిచడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Read Also: Al Jazeera: కెమెరాలు తీసుకుని వెళ్లిపోండి.. ‘‘అల్ జజీరా’’కి ఇజ్రాయిల్ షాక్..

శనివారం ఘటనపై సమాచారం అందుకుని ఆస్పత్రికి చేరుకున్నామని ఎస్పీ విక్రాంత్ వీర్ చెప్పారు. బాలికను మెరుగైన చికిత్స కోసం వారణాసి తరలించినట్లు వీర్ తెలిపారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల నేరస్తులు ఇద్దరిపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్), లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Exit mobile version