Site icon NTV Telugu

Bihar: 12 ఏళ్ల బాలికపై మామ అత్యాచారం.. ఆ తర్వాత కొట్టి చంపి

Gang Rape

Gang Rape

బీహార్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. భోజ్‌పూర్ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై ఆమె మామ అత్యాచారం చేసి కొట్టి చంపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన సోమవారం రాత్రి ధరహర హనుమాన్ తోలా ప్రాంతంలో జరిగింది.

Read Also: Gujarat: ప్రేమికుడికి క్షమాపణ చెప్పి యువతి ఆత్మహత్య.. మిస్టరీగా ఆడియో రికార్డ్!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు బాలికపై లైంగిక దాడి చేసి.. అనంతరం ఇంట్లో కొట్టి చంపాడని స్థానికులు పోలీసులకు తెలిపినట్లు ఎస్పీ తెలిపారు. ఆ అమ్మాయి ఏదో పని నిమిత్తం మేనమామ ఇంటికి వెళ్లిందని… ఆ తర్వాత నిందితుడు ఆమెను లైంగికంగా వేధించి చంపేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడు బాలికను హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని మంచానికి కట్టేసినట్లు వారు పోలీసులకు తెలిపారు.

Read Also: Rahul Gandhi: సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీ పీపీ మాధవన్‌ మృతదేహానికి రాహుల్ నివాళులు..

కుటుంబ సభ్యులు బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో.. వారు నిందితుడి ఇంటికి వెళ్లి చూడగా ఆమె మృతదేహాన్ని మంచానికి కట్టి ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో.. స్థానికులు నిందితుడిని కొట్టి పోలీసులకు అప్పగించారని చెప్పారు. అనంతరం.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్పీ తెలిపారు.

Exit mobile version