రివ్యూ: సెబాస్టియన్ పి.సి. 524
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటీనటులు : కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దారేకర్), శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్
సంగీతం: జిబ్రాన్
కెమెరా: రాజ్ కె.నల్లి
నిర్మాతలు: సిద్ధారెడ్డి, జయచంద్ర రెడ్డి
కథ, దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి
ఈ మధ్య కాలంలో జనాన్ని ఆకట్టుకున్న కుర్ర హీరోల్లో కిరణ్ అబ్బవరం కూడా ఉన్నారు. అతను నటించిన ఎస్.ఆర్.కళ్యాణ మండపం గత సంవత్సరం జనాన్ని భలేగా అలరించింది. అప్పుడే అతను హీరోగా జనం దృష్టిని ఆకర్షించారు. అంతకు ముందు అతను నటించిన రాజావారు-రాణిగారు కూడా అప్పుడు జనానికి గుర్తుకు వచ్చింది. దాంతో కిరణ్ నటించిన తాజా చిత్రం సెబాస్టియన్ పి.సి. 524పై పలువురి దృష్టి మళ్ళింది. ఈ చిత్రం బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. లవ్, సెంటిమెంట్, క్రైమ్ కలగలుపుగా సెబాస్టియన్ పి.సి.524 తెరకెక్కింది.
Also Read
ఇక సెబాస్టియన్ పి.సి. 524 కథలోకి తొంగి చూస్తే – సెబాస్టియన్ కు రేచీకటి. అందువల్ల అతనికి రాత్రి అంటే అసలు గిట్టదు. అలాంటి సెబాస్టియన్ చిత్రంగా పోలీస్ అవుతాడు. తనకు రాత్రి డ్యూటీ వేయవద్దని ఇన్ స్పెక్టర్ ను అడుగుతాడు. అయినా ఎవరూ పట్టించుకోరు. సెబాస్టియన్ కు రేచీకటి అన్న విషయం నలుగురికి మాత్రమే తెలుసు. ఒకటి అతని తల్లి, రెండు అతని చిన్ననాటి మిత్రుడు, అతనికి ట్రీట్ చేసే డాక్టర్, అతని ప్రేయసి. ఓ రోజు సెబాస్టియన్ కు ఓ ఇంటి దగ్గర డ్యూటీ వేస్తారు. అక్కడ ఓ అమ్మాయి చనిపోతుంది. రాత్రి సరిగా కనిపించని సెబాస్టియన్ ఉదయం పోలీసు అధికారుల ముందు దోషిగా నిలుస్తాడు. అతని ఉద్యోగం పోతుంది. తరువాత సెబాస్టియన్ తల్లి నీకు ఏమి ఉన్నా అది వేరే. కానీ, న్యాయం మాత్రం గెలవాలి అంటుంది. దాంతో తల్లిపై గౌరవంతో ఈ కేసును సొంతగా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు సెబాస్టియన్. అదే సమయంలో అతని మిత్రుడు విదేశాలకు వెళ్లి ఉంటాడు. సెబాస్టియన్ మాత్రం పట్టు వదలని విక్రమార్కునిలా కేసును గాలిస్తూనే ఉంటాడు. అతని మిత్రుడు రెండేళ్ళ తరువాత స్వదేశం వస్తాడు. రెండేళ్ళయినా ఆ కేసునే పట్టుకు ఊగులాడుతున్నావా అని ప్రశ్నిస్తాడు. ఆధారాలన్నీ పక్కాగా దొరికిన తరువాత అసలు నేరస్థుడు తన చిన్ననాటి మిత్రుడే అని సెబాస్టియన్ కు తెలుస్తుంది సెబాస్టియన్ ఫ్రెండ్ ఓ అమ్మాయిని ప్రేమించి ఉంటాడు. కానీ, ఆ అమ్మాయి మరొకరిని పెళ్ళాడుతుంది. తల్లి కాబోతూఉంటుంది. తనకు దక్కని ఆమె జీవించరాదని అతను ఆమెకు విషం కలిపిన కేక్ ఇచ్చి ఉంటాడు. ఆ ఆధారాలన్నీ సెబాస్టియన్ సంపాదించి ఉంటాడు. న్యాయం గెలవాలి అన్న తల్లి మాటకు గౌరవమిస్తూ, చిన్నప్పుడు రాత్రి పూట కళ్లు కనపడక బస్సు కింద పడబోతుంటే తనను రక్షించిన స్నేహితుడినే చట్టానికి అప్పగిస్తాడు సెబాస్టియన్.
ఈ క్రైమ్ డ్రామాలో తగిన సెంటిమెంట్ కూడా చొప్పించారు దర్శకుడు బాలాజీ. సెబాస్టియన్ గా కిరణ్ అబ్బవరం సరదాగా నటించారు. కామెడీ బాగానే సాగిందనిపిస్తుంది. జిబ్రాన్ సంగీతం అలరిస్తుంది. రాజాధి రాజా... అంటూ సాగే నేపథ్య గీతం ఆకట్టుకుంది. దర్శకుడు కొత్త అయినా అది కనిపించనీయకుండా చేశారు. ఇందులో తల్లిగా నటించిన రోహిణి తప్పిస్తే, మిగిలిన తారల నటనకు అంతగా అవకాశం లేదనే చెప్పాలి.
ప్లస్ పాయింట్స్:
- హీరోగా కిరణ్ అబ్బవరం నటించడం
- క్రైమ్ డ్రామాలోనూ చోటు చేసుకున్న కామెడీ
- జిబ్రాన్ సంగీతం
మైనస్ పాయింట్స్:
- చిన్న కథను సాగదీయడం
- నత్త నడకగా సాగిన కథనం
- కొరవడిన కొత్తదనం
రేటింగ్ : 2.5/5
ట్యాగ్: 524 ఫర్ పన్!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..