Chairman’s Desk : భారత్ సాధించిన చారిత్రాత్మక దౌత్య విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం బ్రిక్స్ సదస్సులో ఏకాభిప్రాయం సాధించిన భారత్.. ప్రపంచ వేదికపై తన దౌత్య సామర్థ్యాన్ని మరోసారి నిరూపించకుంది. అంతేకాకుండా బ్రిక్స్ ఉద్దేశాల్ని గుర్తుచేస్తూనే.. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలో కూడా న్యూఢిల్లీ దిశానిర్దేశం చేసింది. గ్లోబల్ సౌత్‌కు బలమైన గొంతుకగా మారిన బ్రిక్స్ ఇకపై నియమాలు రూపొందించే స్థాయికి చేరాలని భారత్ ఆకాంక్షించింది. నాలుగు నెలల క్రితం జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కుదరని ఏకాభిప్రాయం.. ఇప్పుడు అధినేతల మీటింగ్‌లో కుదరటం.. చిన్న విషయం కానే కాదు. ఇప్పటికే బ్రిక్స్ పరిణామాలపై ఓ కన్నేసి ఉంచిన ప్రపంచం.. తాజా పరిణామం తర్వాత బ్రిక్స్‌పై మరిన్ని ఆశలు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ప్రపంచంలో 50 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిక్స్ దేశాలు.. ఓ దృఢ సంకల్పం తీసుకుంటే అమెరికాకు ప్రత్యామ్నాయంగా మారగలవనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
Also Read
- Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
- Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
- Chairmans Desk : ఏపీ ప్రజల జాతకంలో రాజధాని యోగం లేదా..?
- Chairman's Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
రష్యా, భారత్, చైనా సారథ్యంలో ఒక్కటైన బ్రిక్స్ దేశాలకు.. ప్రపంచ జీడీపీలో 40 శాతం వాటా ఉంది. ఒక దృఢ సంకల్పం, ఐకమత్యం, అంతర్జాతీయ విధానాల్లో సారూప్యత, సరళీకృత వ్యాపార బంధాలు ఏర్పరుచుకోగలిగితే.. బ్రిక్స్ దేశాలు తాము అభివృద్ధి చెందటమే కాక.. ప్రపంచంలోనూ ఓ బలమైన శక్తిగా ఏర్పడతాయి. అంతేకాదు అమెరికాను ఒంటరిని కూడా చేయగలుగుతాయి. ఇక్కడ కావాల్సింది దృఢ సంకల్పం మాత్రమే. వ్యక్తిగత ప్రయోజనాలు, ఇగోలు, పక్కనపెట్టి.. ఓ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి అనే సంకల్పంతో బ్రిక్స్ ముందుకెళ్లాలి. ఇవాళ ప్రపంచం మొత్తం ఎవరి అవసరాలకు తగినట్టుగా వాళ్లు అమెరికాపై ఆధారపడుతున్నారు. తమ బలాన్ని, తాము అంచనా వేయలేకపోతున్నాయి దేశాలు. ఓవైపు ప్రపంచం అనిశ్చితిలో ఉన్న తరుణంలో.. ఆచరణాత్మక సహకారం దిశగా బ్రిక్స్ దేశాలకు కొత్త ఆశల్ని రేకెత్తించే సామర్థ్యం ఉందనేది ఇప్పటికే రుజువైన విషయం. అందుకే రష్యా అధ్యక్షుడు పుతిన్ బ్రిక్స్ వేదికగా బలమైన కూటమిగా చెప్పుకుంటున్న జీ-7 ఆర్భాటాన్ని గేలిచేయగలిగారు. ప్రస్తుత ప్రపంచంలో ఏ రకంగా చూసినా బ్రిక్స్ మాత్రమే బలమైన అంతర్జాతీయ కూటమి అని అన్నిదేశాలూ ఒప్పుకునే వాస్తవం. ఈ విషయాన్ని సవాల్ చేసేవారెవరూ లేకపోవడమే బ్రిక్స్ ఘనతకు పెద్ద నిదర్శనం అని చెప్పుకోవచ్చు.
సాధారణంగా మిగతా అంతర్జాతీయ కూటములతో పోలిస్తే బ్రిక్స్‌కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ మిగతా కూటముల మాదిరిగా ఆర్థిక శక్తిని బట్టో.. సైనిక శక్తి ఆధారంగానో దేశాల హోదాలు నిర్ణయించడం లేదు. ప్రపంచంలో అతి పెద్ద దేశాలైన చైనా, రష్యా, భారత్ అయినా.. అలాగే చమురు శక్తులుగా పేరున్న సౌదీ, యూఏఈ లాంటి దేశాలైనా.. బ్రిక్స్ సభ్యత్వం ఉన్న చిన్న దేశం అభ్యంతరం చెప్పినా.. ఏమీ చేయలేవు. అలా అందరి గొంతుకలకూ సమాన ప్రాతినిధ్యం ఇచ్చిన బ్రిక్స్ ఆవిర్భావం నుంచి మిగతా కూటములకు భిన్నంగా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ వస్తోంది. ఎందుకంటే దీనికి మూలం బ్రిక్స్ ఏర్పాటు వెనుక జరిగిన కసరత్తులోనే ఉంది.
బ్రిక్స్ కూటమి.. జీ-7 మాదిరిగా కడుపు నిండిన బాపతు కాదు. అలాగని మరీ బలహీన దేశాల కూటమి కూడా కాదు. ప్రపంచ వృద్ధికి చోదకశక్తులుగా నిలిచే దేశాల సమాహారంగా ఏర్పాటైన బ్రిక్స్.. తొలి నుంచీ సభ్య దేశాల నిరంతర అభివృద్ధిని.. అంతిమంగా ప్రపంచ వృద్ధిని ఆకాంక్షిస్తోంది. అందుకే అంతర్జాతీయ వ్యవహారాల్లో అగ్రదేశాల ఆభిజాత్యాన్ని అడుగుడగునా అడ్డుకుంటూనే ఉంది. ఎక్కడా ఏకపక్ష ధోరణులకు తావివ్వకుండా.. సమగ్ర చర్చలు, సభ్య దేశాలన్నింటి అభిప్రాయాలకు విలువ ఇచ్చి.. భాగస్వామ్య దేశాలనూ చిన్నబుచ్చకుండా జాగ్రత్తపడటం కారణంగానే.. ఇటీవల కాలంలో మరే అంతర్జాతీయ కూటమికీ లేని విధంగా బ్రిక్స్‌కు క్రేజ్ పెరుగుతోంది. తొలినాళ్లలో బ్రిక్స్‌ను చిన్నచూపు చూసిన దేశాలు, కూటములు కూడా ఇప్పుడు బ్రిక్స్ దిశానిర్దేశం ఏమిటా అని ఎదురుచూసే స్థాయికి బ్రిక్స్ ఎదిగింది. సుదీర్ఘ ప్రస్థానం తర్వాత కూడా బ్రిక్స్ ఎక్కడా ఆవిర్భావ లక్ష్యాల నుంచి దూరం జరగలేదు. పైగా ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా.. సరికొత్త లక్ష్యాలు పెట్టుకుని ముందడుగు వేస్తోంది. ప్రపంచ సమస్యల్ని తన సమస్యలుగా భావిస్తూ.. పరిష్కార మార్గాల్ని చూపిస్తోంది. అలాగే స్వార్థ ప్రయోజనాలకు పెద్దపీట వేసే జీ-7 కూటమికి భిన్నంగా.. ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వాన్ని అభిలషిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఐక్యరాజ్యసమితికి కూడా సలహాలు, సూచనలు ఇస్తోంది. ఈ కారణంగానే కొన్నాళ్లుగా ఐక్యరాజ్యసమితి కూడా బ్రిక్స్ అభిప్రాయాలకు విలువ ఇస్తోంది. బ్రిక్స్ దేశాల సూచనల్ని ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
బ్రిక్స్ అసలైన బలం భిన్నత్వంలో ఏకత్వం. పేద, ధనిక దేశాలనే తారతమ్యం లేకుండా.. ఆ మాటకొస్తే కూటమిలో ఉన్న, లేని దేశాలనే తేడా లేకుండా అందరి బాగు గురించి ఆలోచించడమే బ్రిక్స్ అసలు సిసలు బలం. అలాగని బ్రిక్స్ దేశాల్లో పరస్పర వైరుధ్యాలు లేవని కాదు. భిన్నాభిప్రాయాలున్నా సరే.. పరస్పర గౌరవానికి భంగం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఎన్ని గొడవలున్నా.. బ్రిక్స్ సదస్సులో ఏకాభిప్రాయానికి తోడ్పాటు ఇవ్వడం లాంటివి బ్రిక్స్ గౌరవాన్ని బాగా పెంచుతున్నాయి. మనం ఒక్కసారి బ్రిక్స్ ఏర్పాటైన పరిస్థితుల్ని గుర్తుకుతెచ్చుకుంటే.. ప్రపంచం అంటే అమెరికా, యూరప్ మాత్రమే. మిగతా దేశాలన్నీ వాటికి చేదోడువాదోడుగా ఉండాల్సిందే అనే ఏకధృవ ప్రపంచం నడుస్తున్న రోజులవి. కనీసం జీ-7 కూటమిని విస్తరించటానికి కూడా ఆ దేశాలు ముందుకు రాలేదు. అంతేకాకుండా అలా అడిగిన దేశాల్ని పనిగట్టుకుని అవమానించాయి. అప్పటికే ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్న దేశాల్ని కూడా ద్వితీయ శ్రేణి దేశాలుగా చూసే పోకడ శృతిమించింది. ఇక ఆఫ్రికాలో పేద దేశాలంటే అసలు జీ-7కు లెక్కే లేదు. దీంతో విసిగిపోయిన వర్థమాన శక్తులు.. ఆలస్యంగా అయినా ఒక్కతాటిపైకి వచ్చి బ్రిక్స్ ఏర్పాటుచేశాయి. ఆ తర్వాత బ్రిక్స్ మరో జీ-7 కాకూడదనే సదుద్దేశంతో నిరంతర విస్తరణకు, సమ్మిళితతత్వానికి పెద్దపీట వేశాయి. ఆ కారణంగానే ఆఫ్రికాలో బలహీన దేశాలనూ బ్రిక్స్ నిర్మొహమాటంగా చేర్చుకోవడమే కాదు.. వారి సమస్యలపైనా సమాన శ్రద్ధ పెట్టి.. వాటి పురోభివృద్ధికి ఇతోధిక తోడ్పాటు అందిస్తోంది. మొదట్లో బ్రిక్స్ని తక్కువ అంచనా వేసిన కూటములు, దేశాలకు కూడా బ్రిక్స్ ధోరణి చూసిన తర్వాత జ్ఞానోదయం అయింది. అప్పటివరకు బ్రిక్స్ ఆవిర్భావ లక్ష్యాలు ఆచరణలో ఆవిరైపోతాయని ఎదురుచూసిన అగ్రదేశాలకు కూడా ఆశాభంగం తప్పలేదు. బ్రిక్స్ అప్పటికీ.. ఇప్పటికీ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ.. రోజురోజుకీ ప్రపంచ శక్తిగా ఎదుగుతూ వస్తోంది. అందుకే ప్రస్తుత ప్రపంచ అనిశ్చితికి బ్రిక్స్ మాత్రమే ముగింపు పలకగలదనే విశ్వాసం ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.
ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు కూడా బ్రిక్స్‌కు అమెరికాకు ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలిస్తున్నాయనడంలో సందేహం లేదు. యుద్ధాలు ఆపేస్తానంటూ బీరాలు పలికిన అమెరికా.. ఘోరంగా చతికిలపడింది. తన స్వార్థం తాను చూసుకుంటూ.. మిగతా ప్రపంచాన్ని గాలికొదిలేసింది. తద్వారా ప్రపంచ పెద్దన్న పీఠాన్ని తనంతట తానుగా ఖాళీచేసే ప్రయత్నాల్లో ఉంది. మరోవైపు రోజురోజుకీ బ్రిక్స్ దేశాల సామర్థ్యం విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా పెద్ద దేశాలైన భారత్, రష్యా, చైనా.. ప్రపంచానికి అసలు సిసలు చోదకశక్తులనే స్థాయి నుంచి.. సరికొత్త ఆర్థిక శక్తులుగా అవతరించాయి. దీంతో ఈ మూడు దేశాలు ఓ మాటనుకుని.. బ్రిక్స్ని ఆ దిశగా ముందడుగు వేయిస్తే.. బ్రిక్స్ త్వరలోనే అమెరికాకు ప్రత్యామ్నాయం కాగలుగుతుందనే అంచనాలున్నాయి.
తాజావార్తలు
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?