NTV Telugu Site icon

Zomato: జొమాటో సీఓడీ ఆర్డర్లలో 70 శాతం రూ. 2000 నోట్లే.. విత్ డ్రా ఎఫెక్ట్..

Zomato

Zomato

Zomato: రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ). అయితే అప్పటి నుంచి జనాలు ఉన్న రూ.2000 నోట్లతో కొనుగోళ్లను ప్రారంభించారు. షాపింగ్ మాల్స్, హోటళ్లలోకి ఈ నోటుతో కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే రూ.2000 నోటును ఉపసంహరిస్తున్నామని ఆర్బీఐ ప్రకటించిందో.. అప్పటి నుంచి జొమాటోలో క్యాష్ ఆన్ డెలివరీ(సీఓడీ)ఆర్డర్లలో కస్టమర్లు ఈ నోటును ఇస్తున్నట్లు వెల్లడించింది.

Read Also: Giriraj Singh: అప్పుడే ముస్లింలందర్ని పాకిస్తాన్ పంపాల్సింది.. కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

ఫుడ్ టెక్ దిగ్గజం జొమాటో ఈ విషయాన్ని ట్విట్టర్ పోస్ట్ లో వెల్లడించింది. 2,000 రూపాయల నోట్ల కుప్పపై డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఉన్న చిత్రాన్ని పంచుకుంది. శుక్రవారం నుండి, మా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్‌లలో 72 శాతం రూ.2000 రూపాయల నోట్లనే ఇస్తున్నారని జొమాటో తెలిపింది. ‘‘పిల్లలు బ్యాంకుల్లో రూ.2000 నోటును మారస్తారు, పెద్దలు సీఓడీలో రూ.2000 నోటు ఇస్తారు. లెజెండ్స్ వద్ద రూ.2000 నోటు ఉండదు’’ అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది. ఇటీవలే జొమాటో తన యూపీఐ సేవలను ప్రారంభించింది. ఎక్కువ మంది కస్టమర్లు యూపీఐతోనే చెల్లింపులు చేస్తుండటంతో జొమాటో కొత్తగా యూపీఐ సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే క్రమంగా సీఓడీ ఆఫ్షన్ ఎత్తేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రూ. 2,000 నోట్ల చలామణిని ఉపసంహరించుకునే నిర్ణయాన్ని ప్రకటించింది మరియు ఈ చర్య మొదట్లో ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. అయితే సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది అన్ని బ్యాంకుల్లో ఒకసారి రూ. 20,000 వరకు రూ. 2000 నోట్లను మార్పించుకోవచ్చని తెలిపింది. ఈ రోజు నుంచి నోట్లను మార్పించుకోవచ్చు.