ప్రస్తుత రోజుల్లో ఏ పని జరగాలన్నా డబ్బు ఉండాల్సిందే. అందుకే ప్రపంచమంతా డబ్బు వెనకాల పరుగెడుతున్నది. సంపాదన కోసం కొందరు ఉన్న డబ్బును రెట్టింపు ఎలా చేసుకోవాలని మరికొందరు ఆలోచిస్తున్నారు. వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని సేవ్ చేయాలని భావిస్తున్నారు. ఫ్యామిలీకి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇన్వెస్ట్ మెంట్ పథకాలపై దృష్టిసారిస్తున్నారు. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టాలనకుంటున్నారా? అయితే మీకోసం అద్బుతమైన ప్రభుత్వ స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. ఇదొక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్.
పీపీఎఫ్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ ఉండదు. ఇందులో రోజుకు రూ. 50 ఇన్వెస్ట్ చేస్తే చాలు మెచ్యూరిటీ నాటికి ఏకంగా రూ. 5 లక్షలు అందుకోవచ్చు. మరి ఈ పీపీఎఫ్ స్కీమ్ మెచ్యూరిటీ టైమ్ ఎంత? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పీపీఎఫ్ స్కీమ్ లో కనీస పెట్టుబడి రూ. 500. గరిష్టంగా రూ. 1,50,000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. పీపీఎఫ్ స్కీమ్ లో 15 ఏళ్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పథకంలో వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. ఈ పథకంలో తక్కువ పెట్టుబడితో లక్షల్లో లాభాన్ని పొందొచ్చు.
పీపీఎఫ్ పథకం ద్వారా మీరు రూ. 5 లక్షలు పొందాలంటే.. రోజుకు రూ. 50 అంటే నెలకు రూ. 1500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సంవత్సరానికి రూ. 18 వేలు అవుతుంది. ఇలా 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 15 ఏళ్లలో మీ పెట్టుబడి 2,70,000 జమ అవుతుంది. ప్రస్తుతమున్న వడ్డీ రేటు ప్రకారం మీ పెట్టుబడిపై 2,18,185 వడ్డీ సమకూరుతుంది. మెచ్యూరిటి నాటికి మీ పెట్టుబడి, దానిపై వచ్చ వడ్డీ ఆదాయం కలుపుకుని మొత్తం రూ. 4,88,185 చేతికి అందుతుంది. అంటే మీకు దాదాపు రూ. 5 లక్షలు వస్తాయి.
పీపీఎఫ్ స్కీమ్ ను బ్యాంకుతో పాటు పోస్టాఫీసులో కూడా ఓపెన్ చేయొచ్చు. ఆధార్, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, నివాస చిరునామా రుజువు, నామినీ డిక్లరేషన్ కోసం ఫారం, పాస్‌పోర్ట్ సైజు ఫోటో అందించి అకౌంట్ తెరవొచ్చు. పీపీఎఫ్ లో పెట్టుబడి పెట్టిన ప్రధాన మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. 1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పెట్టుబడి మొత్తం విలువను పన్ను మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు.