Harsh Goenka: వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారం కూడా పని చేయాలంటూ ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వివాదంపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గొయెంకా రియాక్ట్ అయ్యారు. ఇది వినాశనానికే గానీ.. విజయానికి కాదంటూ సెటైర్లు వేవాడు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వారానికి 90 రోజుల పనా?.. సండేను సన్-డ్యూటీ అని.. డే ఆఫ్‌ను ఓ ఊహాజనిత భావన అని ఎందుకు మార్చకూడదంటూ హర్ష్ గొయెంకా పేర్కొన్నాడు.
Read Also: Kangana Ranaut : మంచి దర్శకుడు అంటూ భూమ్మీద ఎవ్వరు లేరు : కంగనా రనౌత్
ఇక, కష్టపడి తెలివిగా పని చేయడంపై నాకు నమ్మకం ఉంది.. కానీ, జీవితాన్ని శాశ్వతమైన ఆఫీసు షిప్టుగా మారిస్తే అది వినాశనానికి దారితీస్తుంది తప్ప విజయాన్ని తీసుకురాదు హర్ష్ గొయెంకా వెల్లడించారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది ఆప్షన్ కాదు.. అవసరం అని నా అభిప్రాయం అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ‘వర్క్ స్మార్ట్ నాట్ స్లేవ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను అతడు జోడించాడు. ప్రస్తుతం హర్ష్ గొయెంకా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: Flipkart Monumental Sale 2025: ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్.. ప్రతి గంటకు కొత్త డీల్స్!
అయితే, ఎల్ అండ్ టీ ఛైర్మన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణం అన్నారు. అలాగే, ఈ విషయంపై భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా రియాక్ట్ అయింది. విద్యావంతులు, ప్రముఖ కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులే ఇలా మాట్లాడడం మంచిది కాదు.. మానసిక ఆరోగ్యం, ప్రశాంతత లాంటివి పట్టించుకోకపోగా.. స్త్రీల పట్ల విద్వేషపూరిత ప్రకటనలు చేయడం విచారకరం అన్నారు.
Read Also: Nithya Menen : సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న నిత్యామీనన్
కాగా, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన కామెంట్స్ పై కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ఎనిమిది దశాబ్దాలుగా జాతి నిర్మాణమే ఎల్ అండ్ టీకి ప్రధాన లక్ష్యంగా పని చేస్తుందని వెల్లడించింది. భారతదేశ మౌలిక వసతులు, పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలను ఎల్ అండ్ టీ ఎప్పటికప్పుు మెరుగుపరిచిందన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదిగే క్రమంలో అసాధారణ లక్ష్యాలను చేరుకోవాలంటే అసాధారణ కృషి చాలా అవసరం అని పేర్కొనింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలనే ఛైర్మన్ ఈ వ్యాఖ్యలు చేశారని ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
This is getting unreal… Seriously?? Let's ask openly how many of our star industrialists on X endorse this view starting with @Infosys_nmurthy @anandmahindra @hvgoenka @udaykotak @sajjanjindal @AnilAgarwal_Ved @MPNaveenJindal @ananya_birla @hcmariwala @sbikh @kunalkamra88 https://t.co/Cn4HZiMQaH
— Sucheta Dalal (@suchetadalal) January 9, 2025