WhatsApp: వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్.. ఇక ఇలా చేయొచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల అభిరుచికి తగినట్టుగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది.. సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెస్తోంది.. గతంలో.. ప్రస్తుతం.. యూజర్లు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. వారికి ఇకపై ఆ ఇబ్బందులు ఉండొద్దు.. అనే కోణంలో.. కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొస్తూనే ఉంది వాట్సాప్.. తాజాగా, మరో కీలకమైన కొత్త ఫీచర్‌ను పరిచయం చేసేందుకు సన్నద్ధమవుతోంది. పంపించిన మెసేజులను ఎడిట్ చేసుకునే ఆప్షన్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది వాట్సాప్ టీమ్..
Read Also: Harish Rao: మెడికో ప్రీతి ఘటన బాధాకరం.. పూర్తిస్థాయిలో విచారణ
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ప్రస్తుతం ఐవోఎస్ బెటా యూజర్లకు ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయడంపై ఫోకస్ పెట్టింది వాట్సాప్.. ఈ విషయాన్ని వాట్సాప్‌కు సంబంధించిన అప్డేట్లను రిపోర్ట్ చేసే వాబెటాఇన్ఫో వెబ్సైట్ తన రిపోర్టులో పేర్కొంది. వాట్సాప్ త్వరలో తీసుకురానున్న అప్డేట్లలో ఈ ఫీచర్ కూడా ఉండనున్నట్టు ఆ సంస్థ వర్గాలు చెబుతున్నాయి.. వాట్సాప్ తీసుకొస్తోన్న సరికొత్త ఫీచర్ ప్రకారం.. వాట్సప్‌లో మెసేజ్ పంపించిన 15 నిమిషాల వ్యవధిలోనే యూజర్లకు ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉండబోతోంది.. ఒకవేళ మెసేజ్ తప్పుగా పంపించినా లేదా మరింత సమాచారాన్ని జోడించాలనుకున్నా ఈ ఎడిట్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు అంటోంది వాట్సాప్.. అయితే.. సెంట్ మెసేజ్‌ను డిలీట్ చేసుకునే వెసులుబాటును ఇప్పటికే తీసుకొచ్చింది ఈ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్.. ఇకపై మెసేజ్ మొత్తం డిలీట్ చేయాల్సిన అవసరం లేకుండా.. ఎడిట్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది.. అది అందుబాటులోకి వస్తే.. మెసేజ్ మొత్తాన్ని డిలీట్ చేయకుండా ఎడిట్ చేసుకుంటే సరిపోతోంది అంటున్నాయి ఆ సంస్థ వర్గాలు..
టెలిగ్రామ్ మాదిరిగా కాకుండా, టెక్స్ట్ పంపిన క్షణం నుండి 15 నిమిషాల కాలపరిమితితో వినియోగదారులు పంపిన సందేశాలను ఎలా సవరించవచ్చో పరిమితం చేయాలని వాట్సాప్ భావిస్తుంది. పంపిన సందేశాలను ఎడిటింగ్ చేయడానికి ఇదే విధమైన విధానాన్ని IMessage అవలంబిస్తుంది. వాట్సాప్ పంపినవారు సవరించిన సందేశాలపై సవరించిన లేబుల్‌ను కూడా ప్రదర్శిస్తుంది. ఈ లక్షణం చిత్రాలు, వీడియోలు లేదా పత్రాల కోసం మాత్రమే కాకుండా.. సందేశాల కోసం మాత్రమే పని చేస్తుంది. అయితే ఇది ప్రజలకు ఎప్పటి నుంచి అందుబాటులో వస్తుంది అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది..
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!