Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం ‘ఆక్సిజన్’.. ఊహించని నిర్ణయంతో బతికిపోయిన వీఐ కంపెనీ!
- ఏకంగా రూ.23 వేల కోట్ల ఏజీఆర్ బకాయిల తగ్గింపు
- గతంలో రూ.87,695 కోట్లుగా ఉన్న ఏజీఆర్ బకాయిలు
- తాజా తగ్గింపుతో రూ.64,046 కోట్లకు చేరిన బకాయిలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vodafone Idea: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi)కు కేంద్ర ప్రభుత్వం మరోసారి ‘సంజీవని’ని అందించింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (AGR) బకాయిల లెక్కల్లో చోటుచేసుకున్న వ్యత్యాసాలను సవరించిన టెలికాం శాఖ (DoT), కంపెనీకి భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కంపెనీపై ఉన్న దాదాపు రూ.23,649 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గనుంది. ఏజీఆర్ లెక్కింపుపై టెలికాం కంపెనీలు, ప్రభుత్వానికి మధ్య సుదీర్ఘ కాలంగా న్యాయపోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ విచారణ అనంతరం, వీఐ బకాయిలను భారీగా తగ్గించారు. గతంలో రూ.87,695 కోట్లుగా ఉన్న ఏజీఆర్ బకాయిలను ఇప్పుడు రూ.64,046 కోట్లకు సవరించారు. గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
వాయిదాల పద్ధతిలో చెల్లింపులు..
బకాయిలను తగ్గించడమే కాకుండా, వాటిని చెల్లించే గడువును కూడా కేంద్రం వెసులుబాటు కల్పించింది. 2026 మార్చి నాటికి కంపెనీ చెల్లించాల్సిన రూ.16,400 కోట్ల భారం ప్రస్తుతం తప్పుకుంది. 2031-32 ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే నాలుగేళ్ల పాటు ఏటా రూ.100 కోట్ల చొప్పున చెల్లించాలి. మిగిలిన భారీ మొత్తాన్ని 2035-36 నుంచి 2040-41 మధ్య ఆరు సమాన వార్షిక వాయిదాలలో చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది. టెలికాం రంగంలో ఏకఛత్రాధిపత్యాన్ని నివారించేందుకు కేంద్రం వరుసగా వీఐని ఆదుకుంటూ వస్తోంది. ఇప్పటికే 2021 ప్యాకేజీ కింద బకాయిల వడ్డీని ఈక్విటీగా మార్చడంతో ప్రభుత్వానికి కంపెనీలో 33% వాటా లభించింది. ఇప్పుడు ఏజీఆర్ తగ్గింపుతో కంపెనీ బ్యాలెన్స్ షీట్ మెరుగుపడనుంది.
Also Read
- Jio Platforms IPO GMP today: జియో ప్లాట్‌ఫామ్స్ IPOకు భారీ స్పందన.. రూ.276 ప్రీమియం.. లిస్టింగ్ ధర ఎంతంటే?
- SBI Cyber Attack: ఎస్బీఐ ఖాతాదారుల డేటా డార్క్ వెబ్‌లో లీక్.. 3,897 మందిపై ప్రభావం!
- Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ నేడు ప్రారంభం.. రూ.30,188 కోట్ల ఇష్యూ, జీఎంపీ, లిస్టింగ్ ధర ఎంత?
- Elon Musk: అమెరికా పిల్లలకు మస్క్ ఫ్రీ ఆఫర్.. స్పేస్ఎక్స్ షేర్లు ఉచితం!
జియో, ఎయిర్‌టెల్‌లకు పోటీగా..
ప్రస్తుతం కంపెనీపై రూ.2 లక్షల కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. అయితే ప్రభుత్వ నిర్ణయంతో కంపెనీకి నగదు లభ్యత పెరిగి, కొత్త పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. ఈ నిధులతో నెట్వర్క్ విస్తరణను వేగవంతం చేసి, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చేందుకు వీఐ సిద్ధమవుతోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!