Vedanta: సంచలన నిర్ణయం తీసుకున్న వేదాంత.. ఇక నుంచి 5 కంపెనీలుగా.. ఒక్క షేరుకు 5 కంపెనీల్లో షేర్లు..
ప్రముఖ మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఐదు స్వతంత్ర విభాగాలుగా విభజించే ప్రక్రియలో కీలక ముందడుగు వేసింది. మే 1వ తేదీని విభజన ప్రక్రియకు సంబంధించి కీలకమైన తేదీగా బోర్డు ఖరారు చేసినట్లు కంపెనీ సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. ఈ భారీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వేదాంత గ్రూపులోని అల్యూమినియం, పవర్, ఆయిల్, ఐరన్, స్టీల్ వ్యాపారాలు వేర్వేరుగా విడిపోయి స్వతంత్రంగా లిస్ట్ కానున్నాయి. సహజ వనరుల రంగంలో భారత్‌లో చోటుచేసుకుంటున్న అతిపెద్ద కార్పొరేట్ మార్పులలో ఇది ఒకటిగా నిలుస్తోంది.
ఈ విభజన ప్రణాళిక ప్రకారం.. వేదాంత లిమిటెడ్ వాటాదారులు తమ వద్ద ఉన్న ప్రతి ఒక్క షేరుకు బదులుగా కొత్తగా ఏర్పడే ఐదు సంస్థలలో ఒక్కో షేరును అదనంగా పొందుతారు. అంటే ఇన్వెస్టర్లు వేదాంత అల్యూమినియం మెటల్ లిమిటెడ్ (VAML), తల్వండి సాబో పవర్ లిమిటెడ్ (TSPL), మాల్కో ఎనర్జీ లిమిటెడ్ (MEL), వేదాంత ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ (VISL) వంటి సంస్థలలో సమాన వాటాలను అందుకుంటారు. 5 సంస్థల్లో షేర్లను కలిగి ఉంటారు. వేదాంత లిమిటెడ్ మాత్రం బేస్ మెటల్స్ వ్యాపారాన్ని తన వద్దే ఉంచుకుంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా భారత్ అల్యూమినియం కంపెనీ (బాల్కో)లో ఉన్న వాటాలను వేదాంత అల్యూమినియం మెటల్ లిమిటెడ్‌కు బదిలీ చేయనున్నారు.. తద్వారా అల్యూమినియం కార్యకలాపాలన్నీ ఒకే గొడుకు కిందకు రానున్నాయి.
Also Read:TFDA : తెలుగు చిత్రసీమలో సరికొత్త సంచలనం.. దర్శకుల కోసం చదలవాడ శ్రీనివాసరావు బంపర్ ఆఫర్
వ్యాపార విలువను వెలికితీయడం, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం , ఒక్కో విభాగం తన రంగానికి అనుగుణంగా స్వతంత్ర వృద్ధి వ్యూహాలను అనుసరించేలా చేయడం ఈ విభజన ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా, గ్రూపు నిర్మాణాన్ని సరళతరం చేయడం ద్వారా అప్పుల భారాన్ని తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తోంది. వాస్తవానికి 2023లోనే ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ.. అప్పుల రికవరీ, ఇతర సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగింది. చివరకు డిసెంబర్ 2025లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) నుంచి ఆమోదం లభించడంతో ఈ డీమెర్జర్ మార్గం సుగమమైంది. ఈ మార్పు వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులకు తమకు నచ్చిన నిర్దిష్ట విభాగాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తుంది. ఇది దీర్ఘకాలంలో కంపెనీ మార్కెట్ విలువను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం స్టాక్ మార్కెట్లోని ఇన్వెస్టర్లకు కొత్త అవకాశాలను సృష్టించడమే కాకుండా, మైనింగ్ రంగంలో వేదాంత పట్టును మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Vedanta: సంచలన నిర్ణయం తీసుకున్న వేదాంత.. ఇక నుంచి 5 కంపెనీలుగా.. ఒక్క షేరుకు 5 కంపెనీల్లో షేర్లు..
-
Huawei Pura X Max: 7.7-అంగుళాల స్క్రీన్, 5,300mAh బ్యాటరీతో.. కొత్త ఫోల్డబుల్ 5G ఫోన్ విడుదల
-
KCR : జీవన్ రెడ్డి కి గులాబీ కండువా కప్పి BRS లోకి ఆహ్వానించిన కేసీఆర్
-
AP Government Job Recruitment: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానిక కేడర్ ఖరారు..
-
Kara: ఏప్రిల్ 30న తెలుగులో ధనుష్ ‘కర’ రిలీజ్
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?