NTV Telugu Site icon

GTRI: చైనా-అమెరికా మధ్య ఉద్రిక్తత.. భారత్‌కు బంపర్ అవకాశం..!

India

India

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశాలైన అమెరికా, చైనాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తత నెలకొంది. ఇరు దేశాలు పరస్పరం కంపెనీలపై అనేక ఆంక్షలు విధించుకున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా చైనా ప్రపంచ కర్మాగారంగా ఉంది. పలు చైనా వస్తువులపై సుంకాలను పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. వీటిలో ఉక్కు, సౌర ఘటాలు, లిథియం అయాన్ బ్యాటరీలు, వాటి భాగాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, వైద్య ఉత్పత్తులు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి 2026 వరకు అనేక దశల్లో ఈ టారిఫ్ అమలు కానుంది. ఈ అవకాశాన్ని భారత్‌ సద్వినియోగం చేసుకోవచ్చు.

READ MORE: Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం పొడిగించడం వల్ల భారతదేశం తన ఎగుమతులను పెంచుకోవడానికి.. అమెరికన్ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి సహాయపడుతుందని థింక్ ట్యాంక్ జీటీఆర్‌ఐ తెలిపింది. యూఎస్ సెనేట్ ప్రవేశపెట్టిన రెండు బిల్లుల వల్ల చైనా నుంచి దిగుమతులు ప్రభావితమవుతాయి. అమెరికా కంపెనీలు చైనా కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నందున భారత్‌కు దీనితో అవకాశం ఉంది. అమెరికా కంపెనీలు చైనాపై ఆధారపడటం తగ్గించుకోవడం వల్ల భారత్‌కు అవకాశాలు పెరుగుతాయని జిటిఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అన్నారు.

READ MORE:Supreme Court: రేషన్ కార్డుల జాప్యంపై ధర్మాసనం తీవ్ర అసహనం.. ఓపిక నశించిందని వ్యాఖ్య

భారతదేశం ఏమి చేయాలి?
తయారీ రంగంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్, ఇతర పరిశ్రమలలో భారతదేశం ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించగలదు. పీఎన్‌టీఆర్చట్టం యొక్క ఉద్దేశ్యం చైనా యొక్క అనుకూలమైన వాణిజ్య స్థితిని అంతం చేయడం. అయితే ఏఎన్‌టీ చట్టం యొక్క ఉద్దేశ్యం చైనా-రష్యాపై విరుచుకుపడటం. ముఖ్యంగా ఏఎన్టీ చట్టం భారతదేశానికి గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందని శ్రీవాస్తవ అన్నారు. ఎందుకంటే అమెరికా కంపెనీలు చైనా వంటి మార్కెట్యేతర ఆర్థిక వ్యవస్థల నుంచి ఉత్పత్తిని తరలించాలను కుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎగుమతులను పెంచే లక్ష్యంతో చైనా కంపెనీలను, పెట్టుబడులను ఆహ్వానించాలన్న ప్రతిపాదనలను భారత్ పునరాలోచించాలని అన్నారు.

READ MORE:Jeep Compass: జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ రిలీజ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

చైనీస్ ఉత్పత్తులపై అధిక సుంకాలు భారతదేశానికి దాని తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి అవకాశం కల్పిస్తాయి. చైనాకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్న బహుళజాతి కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత్ చురుగ్గా కృషి చేయాలని జిటిఆర్‌ఐ ప్రభుత్వానికి సూచించింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, మెషినరీ, టెక్స్‌టైల్స్, సోలార్ ప్యానల్ తయారీలో తయారీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.