NTV Telugu Site icon

Call Merging Scam: యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. కాల్ మెర్జ్ చేస్తున్నారా? మీ ఖాతా ఖాళీ అవుతుంది జాగ్రత్త!

Upi

Upi

టెక్నాలజీని వాడుకుని సైబర్ నేరగాళ్లు చేసే మోసాలు అన్నీఇన్నీ కావు. ఫేక్ మెసేజ్ లు, కాల్స్, లింక్స్ పంపి అమాయకులను మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్, మిస్డ్ కాల్ స్కామ్ ల ద్వారా బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. అదే కాల్ మెర్జింగ్ స్కామ్. దీనిపై యూజర్లకు యూపీఐ బిగ్ అలర్ట్ ఇచ్చింది. మీరు పొరపాటున కాల్ మెర్జ్ చేశారో మీ ఖాతాలోని డబ్బులు ఖాళీ అయినట్టే. మరి కాల్ మెర్జింగ్ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

Also Read:Bangladesh : ఈద్ సందర్భంగా బంగ్లాదేశ్ యూనస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లబ్ధిపొందనున్న 20లక్షల కుటుంబాలు

కాల్ మెర్జింగ్ స్కామ్ లో సైబర్ క్రిమినల్స్ యూపీఐ యూజర్లను కాల్ మెర్జింగ్ పేరిట మోసం చేసి తెలియకుండానే వారి వన్ టైమ్ పాస్ వర్డ్ లను OTP కాజేస్తున్నారు. ఇది స్కామర్లు అనధికార లావాదేవీలు, ఖాతాలు లూటీ చేయడానికి అనుకూలంగా మారింది. అయితే దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), అఫీషియల్ X ఖాతాలో, వినియోగదారులను హెచ్చరించింది, “స్కామర్లు మిమ్మల్ని మోసం చేసి OTP లను దొంగిలించడానికి కాల్ మెర్జింగ్‌ను ఉపయోగిస్తున్నారు. స్కామర్ల వలలో పడకండి. అప్రమత్తంగా ఉండండి, మీ డబ్బును కాపాడుకోండి.” అంటూ అలర్ట్ చేసింది.

Also Read:CM Revanth Reddy : ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ కఠిన చర్యలు.. ఉచిత ఇసుక సరఫరాకు ప్రత్యేక కమిటీ

ఇంతకీ ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ ఎలా జరుగుతుందంటే.. ఒక అపరిచితుడు మీ ఫ్రెండ్ నుంచి నెంబర్ తీసుకుని కాల్ చేస్తున్నట్లు చెప్పడంతో ప్రారంభమవుతుంది.ఆ తర్వాత స్కామర్ ఆ స్నేహితుడు వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని కాల్ మెర్జ్ చేయమని కోరతాడు. కానీ ఆ కాల్ ఫ్రెండ్ నుంచి వచ్చింది కాదు OTP నుంచి వచ్చింది. ఇక కాల్ మెర్జ్ కాగానే ఆ వ్యక్తికి తెలియకుండానే వారి బ్యాంక్ నుంచి చట్టబద్దమైన OTP ధృవీకరణ కాల్ తో కనెక్ట్ అవుతారు.

Also Read:CM Chandrababu: జీబీఎస్‌పై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

దీంతో స్కామర్ కాల్ లోని OTPని విని మీ బ్యాంక్ ఖాతాను లూటీ చేస్తాడు. ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే తెలియని నెంబర్లతో వచ్చిన కాల్స్ ను మెర్జ్ చేయకూడదు. బ్యాంకు నుంచి లేదా ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చినట్లైతే నిజ నిర్థారణ చేసుకోవాలి. మీరు చేయని ట్రాన్సాక్షన్ కు OTP వస్తే మీ బ్యాంకును అప్రమత్తం చేసి 1930కి కంప్లైంట్ చేయాలి.