UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Safety: యూపీఐ చెల్లింపులు భారతదేశంలో రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. టీ దుకాణం నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు దాదాపు ప్రతి చోటా ఫోన్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌ల వల్ల నగదు అవసరం చాలా వరకు తగ్గిపోయింది. అయితే యూపీఐ వినియోగం పెరిగిన కొద్దీ సైబర్ నేరగాళ్ల మోసాలు కూడా పెరుగుతున్నాయి. కేవలం కొన్ని సెకన్ల నిర్లక్ష్యం వల్లే బ్యాంక్ ఖాతాలోని డబ్బు కోల్పోయిన సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.
చాలామంది డబ్బు అందుకోవడానికి వచ్చిన రిక్వెస్ట్‌ను పొరపాటున ఆక్సెప్ట్ చేస్తుంటారు. నిజానికి యూపీఐలో డబ్బు తీసుకునేవనేందుకు ఎలాంటి పిన్ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. పిన్ అడిగితే అది డబ్బు పంపే ప్రక్రియలో భాగమని గుర్తుంచుకోవాలి. ఈ విషయంపై అవగాహన లేకపోవడంతో కొందరు మోసగాళ్ల వలలో పడుతున్నారు. అలాగే క్యాష్‌బ్యాక్, బహుమతులు, లాటరీలు వచ్చాయని చెప్పే నకిలీ లింక్‌లను క్లిక్ చేయడం కూడా ప్రమాదకరమే.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు. బ్యాంక్ ఉద్యోగులమని చెప్పినా, కస్టమర్ కేర్ పేరుతో ఫోన్ చేసినా ఈ వివరాలను ఇవ్వకూడదు. చాలామంది సమస్య పరిష్కారం కోసం స్క్రీన్ షేరింగ్ యాప్‌లను కూడా ఇన్స్టాల్ చేస్తుంటారు. దీని ద్వారా మోసగాళ్లు ఫోన్‌పై నియంత్రణ సాధించే అవకాశం ఉంటుంది.
డిజిటల్ లావాదేవీలు సౌకర్యవంతమైనవే అయినా భద్రత విషయంలో జాగ్రత్త అవసరం. తెలియని లింక్‌లను ఓపెన్ చేయకపోవడం, యాప్‌లను అధికారిక స్టోర్ల నుంచే డౌన్లోడ్ చేసుకోవడం, అనుమానాస్పద కాల్స్‌ను నమ్మకపోవడం వంటి చిన్న జాగ్రత్తలు పెద్ద నష్టాలను నివారించగలవు. యూపీఐ ఎంత వేగంగా డబ్బు పంపుతుందో, అంతే వేగంగా మోసాలు కూడా జరిగే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..