PM Shram Yogi Maandhan Yojana: ఈ స్కీమ్ లో చేరితే.. ప్రతి నెల రూ. 3 వేలు పొందే ఛాన్స్!
- అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్రం స్కీమ్
- ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన
- ప్రతి నెల రూ. 3 వేలు పొందొచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవసరాలకు సరిపడా డబ్బు చేతిలో ఉంటే ఏ చీకుచింతా లేకుండా జీవించొచ్చు. దీనికోసం ముందు నుంచే పొదుపు చేసుకోవడం ప్లాన్ చేసుకోవాలి. అయితే పొదుపు మాత్రమే కాకుండా భవిష్యత్తులో పెన్షన్ కూడా కావాలంటే ఈపీఎఫ్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. కానీ, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఈ వెసులుబాటు ఉండదు. అయితే వీరికి కూడా ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్ ను తీసుకొచ్చింది. అదే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన. ఈ స్కీమ్ లో చేరితే ప్రతి నెల రూ. 3 వేలు పొందొచ్చు.
అసంఘటిత రంగంలో స్వయం ఉపాధి పొందుతున్న కార్మికులు ఈ పథకంలో చేరొచ్చు. ఇది ఒక స్వచ్ఛంద పెన్షన్ స్కీమ్. నెలకు రూ. 15 వేల కంటే తక్కువ వేతనం పొందుతున్న వారు ఈ పథకంలో చేరొచ్చు. 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఇందులో చేరేందుకు అర్హులు. ఈ పథకంలో చందాదారుడు ఎంత జమ చేస్తే.. తిరిగి ప్రభుత్వం కూడా అంతే జమ చేస్తుంది. ఇక సభ్యుడికి 60 ఏళ్లు వచ్చాక.. నెలకు రూ. 3 వేల చొప్పున పెన్షన్ వస్తుంది. 60 సంవత్సరాల కంటే ముందే మరణిస్తే.. జీవిత భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించొచ్చు. కాగా ఈ పథకంలో 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ. 55 జమ చేయాల్సి ఉంటుంది.
Also Read
- KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
- PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
- EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్‌డ్రాయల్, నామినేషన్‌పై ప్రభావం
- UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
ప్రభుత్వం కూడా అంతే మొత్తం చెల్లిస్తుంది కాబట్టి అప్పుడు నెలకు రూ. 110 చొప్పున మీ మాన్‌ధన్ అకౌంట్లో జమ అవుతుంది. ఇలా 60 ఏళ్లు వచ్చే వరకు చెల్లిస్తూ ఉండాలి. స్కీంలో చేరిన తర్వాత పది సంవత్సరాల కంటే ముందే నిష్క్రమిస్తే.. చందాదారుడు జమ చేసిన మొత్తానికి వడ్డీ కలిపి అందిస్తారు. అయితే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజనలో వయసు పెరుగుతున్న కొద్దీ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. గరిష్టంగా నెలకు రూ. 200 వరకు జమ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీంలో చేరాడానికి మాన్‌ధన్.ఇన్ వెబ్‌సైట్‌కి వెళ్లి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
ఇంకా కామన్ సర్వీస్ సెంటర్లకు (CSC) వెళ్లి వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ స్కీంలో చేరేందుకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లేదా జన్ ధన్ అకౌంట్, ఆధార్ కార్డు ఉండాలి. ముఖ్యంగా వీధి వ్యాపారులు, రిక్షా నడిపేవారు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు వంటి వారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇక ఈ పథకంలో చేరిన వారు టాక్స్ పేయర్ అయి ఉండకూడదు. నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ స్కీంలో భాగం అయి ఉండకూడదు.
తాజావార్తలు
-
Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
-
Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
-
Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!