Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Whisky Business: దేశంలోని ప్రముఖ మద్యం తయారీ సంస్థల్లో ఒకటైన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) భారీ లాభాలను నమోదు చేసింది. డయాజియో నియంత్రణలో ఉన్న ఈ సంస్థ, FY2027 జూన్ త్రైమాసిక ఫలితాలను తాజాగా వెల్లడించింది. ఈ కాలంలో కంపెనీ ఏకీకృత నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 51.55 శాతం పెరిగి రూ.391 కోట్లకు చేరింది. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో USL రూ.258 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. తాజాగా అదే కాలంలో లాభాల్లో భారీ వృద్ధిని సాధించింది. ఇక కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరిగింది. జూన్ త్రైమాసికంలో USL ఆదాయం 4.98 శాతం వృద్ధితో రూ.6,113 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.5,823 కోట్లుగా ఉంది. అలాగే ఇతర ఆదాయాలతో కలిపిన మొత్తం ఆదాయం 7.66 శాతం పెరిగి రూ.6,335 కోట్లకు చేరింది. కంపెనీ మొత్తం ఖర్చులు కూడా స్వల్పంగా పెరిగాయి. జూన్ త్రైమాసికంలో మొత్తం వ్యయాలు 4.63 శాతం పెరిగి రూ.5,781 కోట్లుగా నమోదయ్యాయి.
ఈ సందర్భంగా USL సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సోమేశ్వర్ మాట్లాడుతూ.. FY2027ను కంపెనీ బలమైన వృద్ధితో ప్రారంభించిందని తెలిపారు. ముఖ్యంగా ‘ప్రెస్టీజ్ అండ్ అబవ్’ (P&A) విభాగంలో రెండంకెల వృద్ధి సాధించినట్లు వెల్లడించారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో మరింత వృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. కంపెనీ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ వాటాదారులకు దీర్ఘకాలిక విలువను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. FY2027 తొలి త్రైమాసికంలో USL నికర అమ్మకాల విలువ (NSV) రూ.2,703 కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 6 శాతం వృద్ధి అని కంపెనీ తెలిపింది. కంపెనీ మంచి ఫలితాలు సాధించినప్పటికీ, కొన్ని రాష్ట్రాల విధాన మార్పులు ప్రభావం చూపినట్లు తెలిపింది. ముఖ్యంగా మహారాష్ట్రలోని ప్రతికూల విధాన నిర్ణయాలు, కర్ణాటకలో ఎక్సైజ్ విధాన మార్పులు కొన్ని విభాగాల ఆదాయంపై ప్రభావం చూపినట్లు పేర్కొంది. ‘ప్రెస్టీజ్ అండ్ అబవ్’ విభాగం 10.1 శాతం వృద్ధి సాధించగా, ‘పాపులర్’ విభాగం NSV మాత్రం 17.5 శాతం తగ్గి రూ.206 కోట్లకు చేరింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ నికర అమ్మకాలలో P&A విభాగం 91.7 శాతం వాటాను కలిగి ఉండగా, పాపులర్ విభాగం 7.6 శాతం వాటాను కలిగి ఉంది. మరోవైపు, USL షేర్లు కూడా మార్కెట్లో సానుకూలంగా స్పందించాయి.
Also Read
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
- Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
తాజావార్తలు
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!