బడ్జెట్ 2021.. ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google

2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ‘ఆత్మ నిర్భర్ భారత్’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం కీలక సంస్కరణలు చేపడుతున్నట్లు వెల్లడించారు ఆర్థిక మంత్రి… అన్ని రంగాలకూ సమన్యాయం చేసేలా కేంద్ర బడ్జెట్‌ను రూపొందించినట్లు చెప్పారు. బడ్జెట్లో కేటాయింపులకు అనుగుణంగా వస్తువుల ధరల్లో తగ్గుదల, పెరుగుదల కనిపిస్తుంది. తాజా బడ్జెట్ నేపథ్యంలో ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయో, ఏయే ధరలు తగ్గుతాయో ఓ సారి పరిశీలిద్దాం..
ధరలు పెరిగేవి:
ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగిపోనున్నయి.. ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు పెరిగే అవకాశముంది. ఎల్ఈడీ బల్బులు, సర్క్యూట్ బోర్డులు, వాటి విడి భాగాలు, సోలార్ ఇన్వెర్టర్స్, సోలార్ దీపాల ధరలకు రెక్కలు రావడం ఖాయం.. మొబైల్ ఫోన్స్, ఛార్జర్లు, లిథియంతో తయారు చేసిన ఫోన్ బ్యాటరీ ధరలు మరింత పెరిగే అవకాశముంది. విలువైన రత్నాలు ధరలు కూడా పెరుగుతాయి. ఆటో మొబైల్ విడి విభాగాల ధరలు పెరగవచ్చు. విండ్ స్క్రీన్స్, సిగ్నలింగ్ పరికరాల ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంక్ క్యాట్రిడ్జ్‌లు, ఇంక్ స్ప్రే నాజిల్స్, లెథర్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ముడి సిల్క్, నూలు వస్త్రాల ధరలు పెరుగుతాయి. ప్లాస్టిక్ వస్తువులు, సింథటిక్ వస్తుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉండగా. ఇప్పటిక ముచ్చెమటలు పట్టిస్తున్న వంటనూనె ధరలు మరింత ప్రియం కానున్నాయి.
Also Read
- SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్‌డ్రాయల్‌పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం రూ.25 వేలకు పైగా పెన్షన్!
- PM SVANidhi Scheme: కేంద్రం గుడ్‌న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
- Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
ధరలు తగ్గేవి:
బడ్జెట్ లో దిగుమతి సుంకాలు తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరల్లో కాస్త తగ్గుదల కనిపించనుంది. ప్లాటినం, పల్లాడియం ధరలు తగ్గే అవకాశముంది. అంతర్జాతీయ సంస్థల నుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలు, యంత్రాల ధరలు తగ్గుతాయి. ఇనుము, ఉక్కు, రాగి ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. నైలాన్ దుస్తుల ధరలు తగ్గిపోనున్నాయి.
తాజావార్తలు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
-
Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
-
Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?