దేశంలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) 2023-24 నివేదిక ప్రకారం.. శ్రామిక శక్తిలో పనిచేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గత 6 ఏళ్లలో అంటే 2017-18 నుంచి 2023-24 వరకు నిరుద్యోగిత రేటు 50 శాతం తగ్గిందని నివేదిక పేర్కొంది. ఈ ఆరేళ్లలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా కార్మికుల సంఖ్యలో మార్పు చోటుచేసుకుంది.
READ MORE: DMart Q2 Results: డీమార్ట్‌కు భారీ లాభాలు.. ఎంత ఆదాయం వచ్చిందంటే..!
ముస్లిం మహిళల సంఖ్య పెరుగుదల..
పని చేసే ముస్లిం మహిళల సంఖ్య కూడా 6 సంవత్సరాలలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. గణాంకాల ప్రకారం.. 2017-18 సంవత్సరంలో కేవలం 9 శాతం ముస్లిం మహిళలు మాత్రమే ఉపాధి పొందారు. ఇప్పుడు అది 2.3 రెట్లకు చేరింది. అంటే ఇప్పుడు 20.7 శాతం ముస్లిం మహిళలు పనిచేస్తున్నారు. ముస్లిం మహిళల తర్వాత ఉద్యోగాలు చేస్తున్న సిక్కు మహిళల సంఖ్యలో కూడా వృద్ధి కనిపిస్తోంది. 6 ఏళ్లలో11 నుంచి 24.6 శాతానికి పెరిగింది. ఇది124 శాతంతో సమానం. ఆ తర్వాత హిందూ మహిళా కార్మికుల సంఖ్య విషయానికి వస్తే.. దాదాపు 84 శాతం పురోభివృద్ధి సాధించింది. ఈ 6 ఏళ్లలో ఈ సంఖ్య 17.6 శాతం నుంచి 32.3 శాతానికి చేరింది. ఆరేళ్ల క్రితం 20.2 శాతం క్రైస్తవ మహిళలు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ సంఖ్య 36.3 శాతంగా నమోదైంది. చాలా వరకు ఉద్యోగాలు షెడ్యూల్డ్ తెగ మహిళలే చేస్తున్నారు. గణాంకాల ప్రకారం, వారి సంఖ్య 46 శాతం.
READ MORE:Home Minister Anita: అత్యాచార ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్..
జీతం లేని ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా తక్కువేమీ కాదు…
జీతం, అలవెన్సులు లేకుండా పనిచేసే వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదని నివేదిక పేర్కొంది. ఈ 6 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు అంటే ఏటా 2.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించినట్లు నివేదిక గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో ఏటా కోటి ఉద్యోగాలు కుటుంబ వ్యాపారానికి సంబంధించినవి. లేదా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు ఉన్నారు. వీటిలో పనిచేసే వారికి జీతాలు అందడం లేదు. అంటే జీతం లేని ఉద్యోగాలు చేస్తారు.