US Tariffs: పాకిస్థాన్‌కు ట్రంప్ బిగ్ షాక్! టారిఫ్ అంశంలో సీన్ రివర్స్.. భారత్‌కు లాభం, పాక్‌కు నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Tariffs: పాకిస్థాన్‌కు ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు! తాజాగా భారత్–అమెరికా మధ్య మరో కీలకమైన వాణిజ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా ఒప్పందం ప్రకారం.. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పన్ను 50 శాతం నుంచి నేరుగా 18 శాతానికి తగ్గనుంది. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని హామీతో ఈ ఒప్పందం కుదిరింది. ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు ఎలా షాక్ అవుతందనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. అయితే.. ఈ మధ్య పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌తో ట్రంప్ ఎంత సానిహిత్యంగా మెరిగారో ప్రత్యేకంగా చెప్పనవరసం లేదు. ఓ వైపు… ట్రంప్ చాలా గ్రేట్ అని షరీఫ్, మునీర్ కొనియడుతుంటే.. మరోవైపు.. మునీర్ నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అని ట్రంప్ చెప్పారు. కానీ.. టారిఫ్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఇక్కడ పాకిస్థాన్‌పై అమెరిక 19 శాతం టారిఫ్‌ను విధించింది. భారత్‌పై మాత్రం ఒక శాతం తక్కువ అంటే 18 శాతం సుకం విధించింది. భారత్ కంటే పాకిస్థాన్‌పై టారిఫ్ ఒక శాతం ఎక్కువగా ఉంది. ఇదే పాకిస్థాన్‌కు అమెరికా ఇచ్చిన షాకింగ్‌గా చెబుతున్నారు.
READ MORE: Vishwambhara : విశ్వంభర టీజర్‌పై విమర్శలు.. యూవీ క్రియేషన్స్ షాకింగ్ డెసిషన్!
Also Read
- MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్‌టాక్ సృష్టికర్త..
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
- LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ట్రంప్ టారిఫ్ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికలో ప్రకటించారు. భారత్ ఇకపై అమెరికా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని, అవసరమైతే వెనిజువెలా నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిణామం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనపై ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. “మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై పన్ను 18 శాతానికి తగ్గడం చాలా సంతోషకరం. ఈ గొప్ప నిర్ణయానికి భారత ప్రజల తరఫున అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు,” అని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని, ఎన్నో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని మోడీ పేర్కొన్నారు.
ఈ ఒప్పందంతో ఆసియా ప్రాంతంలోని అనేక దేశాలతో పోలిస్తే భారత్ ఇప్పుడు మెరుగైన స్థితిలో నిలిచింది. చైనా, పాకిస్థాన్, ఇండోనేసియా, బంగ్లాదేశ్, వియత్నాం లాంటి దేశాల కంటే భారత్‌పై అమెరికా విధించే పన్ను తక్కువగా ఉంటుంది. అయితే యూరోప్ దేశాలు, జపాన్, దక్షిణ కొరియా వంటి అమెరికా మిత్రదేశాలతో పోలిస్తే మాత్రం భారత్‌పై పన్ను కొంచెం ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం అమెరికా బ్రెజిల్‌పై 50 శాతం పన్ను విధిస్తోంది. మయన్మార్, లావోస్‌లపై 40 శాతం, చైనాపై 37 శాతం, దక్షిణాఫ్రికాపై 30 శాతం పన్ను ఉంది. దక్షిణాసియాలో వియత్నాం, బంగ్లాదేశ్‌లపై 20 శాతం, పాకిస్థాన్, మలేషియా, కంబోడియా, థాయ్‌లాండ్‌లపై సుమారు 19 శాతం పన్ను ఉంది. మరోవైపు బ్రిటన్‌పై కేవలం 10 శాతం మాత్రమే. యూరోప్ యూనియన్, స్విట్జర్లాండ్, జపాన్, దక్షిణ కొరియాలపై 15 శాతం పన్ను ఉంది.
తాజావార్తలు
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
-
AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
-
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!