Stock Market: అమెరికాతో డీల్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు

  • అమెరికాతో భారత్ డీల్ ఎఫెక్ట్
  • భారీ లాభాల్లో సూచీలు
  • పండుతున్న ఇన్వెస్టర్ల పంట
Stock Market

Stock Market

ఓ వైపు అమెరికాతో భారత్ డీల్.. ఇంకోవైపు జపాన్‌ పార్లమెంట్ ఎన్నికల్లో సనాయే తకైచి విజయం సాధించడంతో దేశీయ మార్కెట్‌కు కలిసొచ్చింది. సోమవారం మార్కెట్ మంచి జోరుగా సాగుతోంది. సనాయే తకైచి గెలుపుతో ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఇక గత వారం భారత్-అమెరికా మధ్య మధ్యంతరం వాణిజ్య ఒప్పందం జరగడంతో దేశీయ మార్కెట్ బాగా కలిసొచ్చింది. సోమవారం మార్కెట్ ప్రారంభం నుంచి సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి.

ఇది కూడా చదవండి: Cyber Crime: రిటైర్డ్ ఇంజనీర్‌పై వలపు వల.. రూ.4 కోట్లు నొక్కేసిన కిలాడీ

ప్రస్తుతం సెన్సెక్స్ 361 పాయింట్లు లాభపడి 83,941 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 25,804 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL టెక్, టాటా స్టీల్, జియో ఫైనాన్షియల్, ఇన్ఫోసిస్ ప్రధాన లాభాలను ఆర్జించగా.. పవర్ గ్రిడ్ కార్ప్, మాక్స్ హెల్త్‌కేర్, HUL, M&M, యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి. FMCG మినహా అన్ని ఇతర రంగాల సూచీలు పెరిగాయి.

ఇది కూడా చదవండి: Trisha : త్రిష ఈ ఏడాదైనా ఒక్క హిట్ అయినా కొడుతుందా?