Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • స్టాక్ మార్కెట్‌కు ఏమైందా?
  • భారత్-యూఎస్ డీల్ ప్రభావం ఢమాల్
  • భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత మార్కెట్‌కు మంచి రోజులొస్తాయని నిపుణులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే మంగళవారం భారీ లాభాల్లో సూచీలు దూసుకుపోయాయి. ఇన్వెస్టర్ల పంట పండింది. రూ.20 లక్షల కోట్ల సంపద పెట్టుబడిదారుల జేబుల్లోకి వెళ్లాయి. కానీ గంటల వ్యవధిలోనే సీన్ మారిపోయింది. బుధవారం ఉదయం మార్కె్ట్ నష్టాల్లో ప్రారంభమై.. అనంతరం లాభాల్లోకి వచ్చింది. ఇక గురువారం అయితే అందుకు పూర్తి భిన్నంగా మార్కెట్ సాగుతోంది. ప్రారంభం నుంచి భారీ నష్టా్ల్లో మార్కెట్ సూచీలు వెళ్తున్నాయి. దీనికి అంతర్జాతీయంగా నెలకొన్న సంకేతాలే కారణంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Ghaziabad Case: అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మిస్టరీ ఏంటంటే..!

ప్రస్తుతం సెన్సెక్స్ 251 పాయింట్లు నష్టపోయి 83, 565 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 25, 697 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ మెటల్ 2 శాతానికి పైగా పడిపోయి.. చెత్త పనితీరు కనబరిచిన రంగంగా అవతరించింది. హిందాల్కో 3 శాతానికి పైగా పడిపోయింది. టాటా స్టీల్, భారత్ ఎలక్ట్రానిక్స్ మరియు లార్సెన్ అండ్ టూబ్రో కూడా తక్కువగా ట్రేడవుతున్నాయి. ఇక రూపాయి విలువ పతనమైంది. గురువారం భారత రూపాయి బలహీనంగా ప్రారంభమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.51కి చేరుకుంది.

ఇది కూడా చదవండి: SA vs IND: బోణి కొట్టిన టీమిండియా.. సౌతాఫ్రికాపై ఘన విజయం!